Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు

వారంలో రెట్టింపైన కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కేసుల సంఖ్య దాదాపు రెట్టింపై 15,700కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి. 11 వారాల పాటు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి మూడు వారాలుగా కేసులు పెరుగుతున్నాయి. దిల్లీ, హరియాణ, యూపీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోవుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే తొలుత అధిక కేసులు నమోదైనా ఆపై గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, రాజస్ధాన్‌, పంజాబ్‌, కర్నాటక రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కరోనాబారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడిరచింది. ఇప్పటివరకు 1,87,71,95,781 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఆదివారం ఒక్కరోజే 3,64,210 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img