Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 38,465 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ప్రస్తుతం 4,03,840 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు.మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,22,662 మంది మృతి చెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.28శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.38శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.38శాతానికి చేరగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.52 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 46.26కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా.. టీకా డ్రైవ్‌లో భాగంగా 45.07కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img