Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో తగ్గుముఖంపడుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్న 1,27,952 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా బారినపడి నిన్న 1059 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో నమోదైన మరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటుండంతో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే.. దాదాపు 22 వేల కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 2,30,814 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13,31,648 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 5,01,114 బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,68,98,17,199 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img