Friday, April 26, 2024
Friday, April 26, 2024

నీట్‌ పీజీ 2022 మే 21కి వాయిదా..

నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష మే 21న నిర్వహించనున్నట్టు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ శుక్రవారం (ఫిబ్రవరి 4) ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12న ఈ పరీక్ష జరగాలి. అయితే నీట్‌2021 కౌన్సెలింగ్‌ కూడా ఇదే సమయంలో ఉన్నందున, పీజీ పరీక్షను 68 వారాలపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారమే పరీక్షల బోర్డును కోరింది. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన వెలువడిరది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం మే 21, 2022న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య నిర్వహించబడుతుందని ఎన్‌బీఈఎమ్‌ఎస్‌ అధికారిక ప్రకటన తెల్పుతోంది.నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్షను వాయిదా వేయవల్సిందిగా మెడికల్‌ విద్యార్ధులు అధికారులను అభ్యర్థించడంతో, నీట్‌ పీజీ 2022 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ నోటిఫికేషన్‌ వెలువడిరది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తు గడువు, పరీక్షతేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే అప్లికేషన్‌ ఎడిట్‌ విండో మార్చి 29 నుండి ఏప్రిల్‌ 7, 2022 వరకు తెరవబడుతుంది. ఇక ఫైనల్‌ ఎడిట్‌ విండో ఏప్రిల్‌ 26 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య తెరవబడుతుంది. అడ్మిట్‌ కార్డ్‌లు మే 16న విడుదల చేయడానికి షెడ్యూల్‌ ఖరారైంది. నీట్‌ పీజీ 2022 ఫలితాలు జూన్‌ 20, 2022 నాటికి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలియజేసింది.కాగా చాలా మంది ఎంబీబీఎస్‌ అభ్యర్థులు గత ఏడాది కోవిడ్‌ విధుల్లో బిజీగా ఉన్నందున తమ ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేయలేకపోయామని, ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యేంతవరకు పరీక్షను వాయిదా వేయవల్సిందిగా కోరారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, అధికారులు పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. నీట్‌ పీజీ పరీక్షకు హాజర్యే అభ్యర్థులు తప్పనిసరి ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలనే నిబంధన ఉంది. పై కారణాల రిత్యా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నీట్‌ పీజీ 2022ను 6-8 వారాలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తాజా ప్రకటన పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img