Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మార్చినాటికి కరోనా థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం : ఐసీఎంఆర్‌

మార్చినాటికి కరోనా థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ్‌ బెంగాల్‌లో థర్డ్‌వేవ్‌ ఫిబ్రవరి చివరినాటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సమీరన్‌ పాండా పేర్కొన్నారు.ఈ రాష్ట్రాల్లో థర్డ్‌ వేవ్‌ తీవ్రత గరిష్ఠానికి చేరిందని, ఈ నెలాఖరు నాటికి కోవిడ్‌ కేసులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వచ్చే మూడు, నాలుగు వారాల్లో దేశంలో థర్డ్‌వేవ్‌ ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే మ్యాథమెటికల్‌ మోడల్‌ ఆధారంగా కేసుల తీరును అంచనా వేసింది ఐసీఎంఆర్‌. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ అభివృద్ధి చేసిన క్రోమిక్‌ మోడల్‌ ప్రకారం .. మార్చి నెల మధ్య నాటికి దేశంలో కరోనా కేసులు చివరి దశకు చేరే అవకాశం ఉంది. జనవరిలో కేసులు పెద్ద ఎత్తున నమోదై తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img