Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

దాదాపు రెండున్నర లక్షల పాజిటివ్‌ కేసులు
భారత్‌లో కరోనా మహహ్మారి విజృంభిస్తోంది.దేశ వ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. తాజాగా రెండున్నర లక్షల సమీపానికి చేరాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు 5 వేలకు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,47,417 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 84,825 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కొవిడ్‌తో 380 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,85,035గా ఉంది. దేశంలో యాక్టీవ్‌ కేసుల సంఖ్య 11,17,531గా ఉంది. అలాగే రోజువారీ పాజిటివీటి రేటు 13.11 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 5,448కి చేరింది. దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు 5 వేలు దాటాయి. నిన్న కొత్తగా 620 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించగా మొత్తం కేసులు 5,488కి చేరాయి. 2,162 మంది కోలుకోవడం ఊరటనిస్తోంది. ఈ వేరియంట్‌ కేసుల పరంగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, దిల్లీ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img