Monday, May 6, 2024
Monday, May 6, 2024

ద్రవ్యోల్బణం పెరుగుతోంది…

ప్రభుత్వం ప్రజలను రక్షించాలి
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

న్యూదిల్లీ : ద్రవ్యోల్బణం మరింత పెరుగుతోందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ శనివారం హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేశ ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ద్రవ్యోల్బణం అనే ఒక పన్ను భారత ప్రజలందరిపై విధించారని, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభానికి ముందు కూడా దేశంలో రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి ప్రజలను అతలాకుతలం చేసిందని ఆయన పేర్కొన్నారు. ‘ముడి చమురు బ్యారెల్‌ ధర 100 డాలర్లకు చేరుకోవడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు కోవిడ్‌ మహమ్మారి ఆటంకాలు, ఆహార ధరలు 22 శాతం పెరగవచ్చని అంచనా నడుమ ఇది (ద్రవ్యోల్బణం) మరింత పెరుగుతోంది’ అని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. ‘ప్రభుత్వం ప్రజలను రక్షించేందుకు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలి’ అని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. కాగా ముడి చమురు ధర, అలాగే ఆహారేతర ఉత్పత్తుల ధరల పెరుగుదల ఫలితంగా ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇక టోకు ధర ఆధారిత ద్రవ్యోల్బణం 13.11 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img