Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నోవావాక్స్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

12-18 ఏళ్లలోపు వయసు వారికి అందుబాటులోకి వ్యాక్సిన్‌..
దేశంలో అనుమతి పొందిన మొదటి ప్రోటీన్‌ ఆధారిత టీకా ఇదే..

12 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న చిన్నారులకు నోవావాక్స్‌ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను కౌమారదశలో ఉన్న పిల్లల కోసం అత్యవసర టీకాగా వినియోగించవచ్చని దీన్ని తీసుకొచ్చిన బయో టెక్నాలజీ కంపెనీ తెలిపింది. నోవావాక్స్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ భారతదేశంలో సీరమ్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవావాక్స్‌ బ్రాండ్‌ పేరుతో అభివృద్ధి చేయబడిరది. దేశంలో అనుమతి పొందిన మొదటి ప్రోటీన్‌ ఆధారిత టీకా ఇదే కావడం గమనార్హం. తమ టీకాకు భారత్‌ ఆమోదం తెలపడంపై నొవొవ్యాక్స్‌ సీఈఓ స్టాన్లె సీ ఎర్స్‌ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ సురక్షితం, సమర్థవంతం అని తేలిన తర్వాతే డీసీజీఐ పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారికి కొవొవ్యాక్స్‌ ఇచ్చేందుకు గతేడాది డిసెంబర్‌లోనే డీసీజీఐ అనుమతి ఇచ్చింది. 12-18 ఏజ్‌ గ్రూపునకు చెందిన 460 మందిపై తమ టీకా రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేసిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. గత నెలలో 12-17 సంవత్సరాల వయస్సున్న 2,247 మందిపై నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ ను పరీక్షించారు. చివరి దశ ట్రయల్స్‌ లో ఈ వ్యాక్సిన్‌ కొవిడ్‌ కు వ్యతిరేకంగా 80శాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు తేలినట్లు వెల్లడిరచింది. ఈ వయస్సు గ్రూపు వారికి అత్యవసర వినియోగానికి పొందిన నాల్గో టీకాగా నోవావాక్స్‌ నిలిచింది. అంతకు ముందు బయోలాజికల్‌ ఈ కంపెనీకి చెందిన కోర్బా వాక్స్‌, జైడస్‌ క్యాడిలాకు చెందిన జైకోవ్‌ డీ, భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ లు ఈ అనుమతులు పొందాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img