Friday, April 26, 2024
Friday, April 26, 2024

న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం : జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ పాల్గొని మాట్లాడారు. మన కర్తవ్యాలను నిర్వర్తించేటప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో దిక్కరణ కేసులు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కాదని తెలిపారు. మున్సిపాల్టీలు, గ్రామ పంచాయితీలు సక్రమంగా డ్యూటీ నిర్వహిస్తే, పోలీసులు సరైన రీతిలో విచారణలు చేపడితే, అక్రమ కస్టడీ మరణాలను నిరోధిస్తే, అప్పుడు ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సీజే రమణ తెలిపారు. ‘న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం. న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను త్వరతగతిన ఏర్పాటుచేయాలి. కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది కావాలి. కోర్టులో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుంది. న్యాయవ్యవస్థలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఏడాది కాలంగా జడ్జీల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించింది.’ అని తెలిపారు. కోర్టులు ఇస్తున్న తీర్పును అనేక ఏండ్ల నుంచి ప్రభుత్వాలు అమలు చేయడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి హాని కలిగించే అంశాలపై కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా.. కావాలనే ఆ తీర్పు అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. విధాన నిర్ణయాలు తమ పరిధిలోకి రావని, కానీ ఎవరైనా వ్యక్తి తమ వద్దకు ఫిర్యాదుతో వస్తే, ఆ వ్యక్తిని కోర్టు తిరస్కరించదని ఎన్వీ రమణ తెలిపారు. ప్రజల ఆశయాలను, ఆందోళనలను అర్దం చేసుకుని, వాటినిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చట్టాలను చేయాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. ప్రజా ప్రయోజన వాజ్యాలను.. వ్యక్తిగత వాజ్యాలుగా వాడుతున్నట్లు ఆరోపించారు. రాజకీయ, కార్పొరేట్‌ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసేందుకు పిల్స్‌ వేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img