Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభం

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో సోమవారం ఆరోగ్య కార్యకర్తలు, సరిహద్దు సిబ్బంది లేదా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తోపాటు 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారికి ప్రికాషన్‌ డోస్‌ ఇవ్వడం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ టీకా కోసం మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల వెల్లడిరచింది. శనివారం సాయంత్రం నుంచే కొవిన్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్లను ప్రారంభించారు. నేటి నుంచి టీకా కేంద్రానికి వెళ్లి కూడా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ డోసుకు అర్హులైనవారు తొలి రెండు డోసులు ఏ టీకానైతే తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే టీకా తీసుకోవాలని తెలిపింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత ప్రికాషన్‌ డోసు వేయించుకోవాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం, 1.05 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన 2.75 కోట్ల మందికి ఈ కార్యక్రమం ప్రకారం ఈ అదనపు డోస్‌లు ఇవ్వనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. టీకా మొదటి, రెండవ డోసుల తర్వాత టీకా ధృవీకరణ పత్రం పొందినట్లే, దీనికి కూడా ధృవీకరణ పత్రం ఇవ్వనున్నారు. గత నెలలో దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న 60 ఏళ్లు పైబడిన వారికి మూడవ టీకాగా ముందు జాగ్రత్త మోతాదులను ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img