Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఫేస్‌బుక్‌ మరో సంచలన నిర్ణయం


సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ను తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఫేస్‌ ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ తెలిపింది. తమ వద్ద ఉన్న వంద కోట్ల మంది యూజర్ల ఫేషియల్‌ డేటాను డిలీట్‌ చేస్తున్నట్లు కూడా ఫేస్‌బుక్‌ వెల్లడిరచింది. ఫేస్‌ స్కాన్‌ డేటాను పూర్తిగా డిలీట్‌ చేస్తున్నట్లు కంపెనీ చెప్పింది.‘విస్తృత వినియోగం నుంచి పరిమిత వినియోగానికి కుదించడానికి ఫేస్‌బుక్‌లో ఫేస్‌ రికగ్నేషన్‌ సాంకేతికతను మేము తొలగించనున్నాం ఫేస్‌బుక్‌లో దీన్ని ఉపయోగిస్తున్నవారు భవిష్యత్తులో ఈ సాంకేతికతను ఉపయోగించలేరు. ముఖ గుర్తింపు కోసం ఉన్న టెంప్లేట్లను తొలగించనున్నాం.’ అని తన బ్లాగ్‌లో మెటా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెరోమ్‌ పెసెంటి తెలిపారు. ఫేస్‌బుక్‌ యాప్‌లో ఉండే యాక్టివ్‌ యూజర్లలో మూడవ వంతు మంది ఫేస్‌ రికగ్నిషన్‌ సెట్టింగ్స్‌ను వాడుతున్నారు. ఫేసియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీపై సమాజంలో చాలా వరకు కలవరం నెలకొన్నదని, ఆ ఆప్షన్‌ విషయంలో ప్రభుత్వం కూడా క్లియర్‌ రూల్స్‌ను రూపొందించలేకపోతున్నట్లు చెప్పారు. కాగా ఫస్‌బుక్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవసీ అండ్‌ సివిల్‌ రైట్స్‌ గ్రూపులు ఆహ్వానించాయి. ప్రమాదకరంగా మారిన ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వినియోగాన్ని నిలువరించడం మంచి పరిణామం అని అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ ఓ ట్వీట్‌లో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img