Friday, April 26, 2024
Friday, April 26, 2024

బొప్పాయి రైతు కుదేలు

. వైరస్‌తో తగ్గిన దిగుబడి
. పడిపోయిన ధరలు
. పెట్టుబడి కూడా దక్కని వైనం

విశాలాంధ్ర-చాగలమర్రి: బొప్పాయి తోటలకు వైరస్‌ తెగుళ్లు సోకడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి, చాగలమర్రి, చక్రవర్తులపల్లె తదితర గ్రామాల్లో 300 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.80 వేలు పెట్టుబడి పెట్టారు. అయితే తెగుళ్లు చుట్టుముట్ట డంతో చెట్ల ఆకులు ముడుచుకపోయి పండు బారాయి. దీంతో దిగుబడిపై ప్రభావం పడిరది. ఎకరాకు 30 టన్నులు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 10 టన్నులు మాత్రమే వస్తోంది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతు న్నారు. గత నెలలో బొప్పాయి టన్ను రూ.18 వేలు ధర పలికింది. ప్రస్తుతం రూ.8 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందు తున్నారు. రంజాన్‌ మాసంలో ఏటా బొప్పాయి పంటకు అధిక ధరలు ఉండేవని, ఈ ఏడాది ధరలు పతనమయ్యాయని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోందని, దీని వల్ల నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కాయలు పక్వానికి వచ్చి కోత కోసే సమయంలో ధరలు పతనమవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. పెట్టుబడి రూపంలో రూ.2 కోట్ల దాకా నష్టం వాటిల్లిం దని రైతులు అంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ద్వారా ఉద్యాన పంటలకు రాయితీలు అందడం లేదన్నారు. బొప్పాయికి సోకిన వైరస్‌ నిర్మూలనకు సూచనలు, సలహాలు ఇచ్చి ఆదుకోవాలని ఉద్యాన అధికారులను రైతులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img