Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బ్రిటన్‌ను దాటి..ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా భారత్‌..!

కరోనా మహమ్మారి సృష్టించిన సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడమే గాక, వేగంగా అడుగులు వేస్తూ సత్తా చాటుతోంది. తాజాగా బ్రిటన్‌ను దాటేసి ప్రపంచంలోనే ఐదో ఆర్థికశక్తిగా అవతరించిందని ‘బ్లూమ్‌బర్గ్‌’ వెల్లడిరచింది.2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్రిటన్‌ ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపింది. ఐఎంఎఫ్‌ నుంచి సేకరించిన జీడీపీ గణాంకాల ప్రకారం… 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిణామం 854.7 బిలియన్‌ డాలర్లుగా ఉండగా… యూకే ఆర్థిక వ్యవస్థ పరిమాణం కేవలం 816 బిలియన్‌ డాలర్లు మాత్రమేనని తెలిపింది. మరోవైపు ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దేశ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో బ్రిటన్‌ జీడీపీ మరింత పతనమయ్యే ప్రమాదముందని బ్లూమ్‌ బర్గ్‌ పేర్కొంది. దశాబ్దం క్రితం ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 11వ స్థానంలో ఉండగా… బ్రిటన్‌ 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు భారత్‌ ఐదో స్థానానికి ఎగబాకగా… బ్రిటన్‌ ఆరో స్థానానికి దిగజారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img