Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా గ్రీన్‌ ఫైనాన్సింగ్‌కు ప్రాధాన్యతివ్వాలి

ఆర్థిక సంస్థలకు ప్రధాని సూచన
న్యూదిల్లీ : ఆర్థిక వ్యవస్థ అవసరాలు తీర్చేందుకు భవిష్యత్‌లో నూతన ఆలోచనలకు మద్దతిచ్చేలా సృజనాత్మక ఫైనాన్సింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధాని మోదీ మంగళవారం ఆర్థిక సంస్థలకు సూచించారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్యం చేసే లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ‘హరిత ఫైనాన్సింగ్‌’ అమలు కావాలని అన్నారు. పర్యావరణ హితమైన ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాటు అందజేయాలని వృద్ధి, ఆశాజనక ఆర్థిక వ్యవస్థ కోసం ఫైనాన్సింగ్‌పై వెబినార్‌లో మోదీ సూచించారు. బడ్జెట్‌ అంశాలపై చర్చించేందుకు ఈ వెబినార్‌ నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈలను స్వీమసమృద్ధి చేసేందుకు తమ ప్రభత్వం చేపట్టిన సంస్కరణలు విజయవంతంగా పరిణమించాయని మోదీ చెప్పారు. ఫిన్‌టెక్‌, అగ్రీటెక్‌, మెడీటెక్‌, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ముందుకు సాగకపోతే ఇండస్ట్రీ 4.0 సాధ్యం కాదని నొక్కిచెప్పారు. ఆ రంగాల్లో ఆర్థిక వ్యవస్థల తోడ్పాటు ఇండస్ట్రీ 4.0ని కొత్త శిఖరాలకు చేరుస్తుందన్నారు. 810 రంగాలను గుర్తించాలన్నారు. నిర్మాణం, స్టార్టప్స్‌, డ్రోన్లు, అంతరిక్షం, జియోస్పాటియల్‌ డేటా వంటి రంగాల గురించి ప్రస్తావించారు. వీటికి రుణమద్దతివ్వడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో టాప్‌3లో భారత్‌ ఉంటుందని ఆర్థిక సంస్థలనుద్దేశించి అన్నారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, సృజనాత్మకత, స్టార్టప్స్‌లో కొత్త మార్కెట్ల అన్వేషణ వంటివి భవిష్యత్‌ ఆలోచనలకు అనుగుణంగా ఫైనాన్స్‌ ఉంటేనే సాధ్యమని మోదీ అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఈ రంగానికి తమ బిజినెస్‌ ప్లానింగ్‌లో ప్రాముఖ్యత కల్పిస్తారా అని ఆర్థిక సంస్థలను, బ్యాంకులను ప్రశ్నించారు. ఎగుమతిదారులకు ప్రాధాన్యత ఇస్తూ రుణాలను బ్యాంకులు అందిస్తే తద్వారా వారు బలోపేతం కావడమే కాకుండా ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఎంతగానో దోహదం అవుతుందని చెప్పారు. సేంద్రియ సాగును ప్రోత్సహించాలని అన్నారు. 202222 కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల అమలుకు ఆచరణసాధ్య పరిష్కారాలతో రావాలని బ్యూరోక్రాట్లకు మోదీ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img