Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘డిజిటల్‌ రూపాయి’తో అనేక ప్రయోజనాలు


ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
బెంగళూరు: డిజిటల్‌ రూపాయి అనేది భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ)తో సంప్రదింపుల తర్వాత తీసుకున్న వివేకంతో కూడిన నిర్ణయమని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఇండియా గ్లోబల్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సులో మంత్రి మాట్లాడారు. ‘ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో సంప్రదింపుల ద్వారా తీసుకున్న ఒక స్పృహతో కూడిన నిర్ణయం… వారు దీన్ని ఎలా చేయాలనుకుంటున్నారో అలా డిజైన్‌ చేయాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఈ ఏడాది సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ కరెన్సీని విడుదల చేస్తుందని మేము భావిస్తున్నాము’ అని డిజిటల్‌ రూపాయిపై ఒక ప్రశ్నకు సమాధానంగా సీతారామన్‌ చెప్పారు.
‘ఆర్బీఐ నిర్వహించే డిజిటల్‌ కరెన్సీలో స్పష్టమైన ప్రయోజనాలను మేము చూస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు, ఈ కాలంలో దేశాల మధ్య జరిగే భారీ చెల్లింపులు, సంస్థల మధ్య పెద్ద లావాదేవీలు, ప్రతి దేశంలోని సెంట్రల్‌ బ్యాంకుల మధ్య పెద్ద లావాదేవీలు అన్నీ డిజిటల్‌ కరెన్సీతో మెరుగ్గా ప్రారంభించబడ్డాయి’అని ఆమె చెప్పారు.
క్రిప్టో కరెన్సీనీ ప్రభుత్వం నియంత్రిస్తుందా లేదా నిషేధిస్తుందా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇష్టపడని మంత్రి, సంప్రదింపుల తర్వాత ప్రభుత్వం దాని గురించి మాట్లాడుతుందని చెప్పారు. ‘సంప్రదింపులు జరుగుతున్నాయి…ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు… సంప్రదింపుల ప్రక్రియ సక్రమంగా పూర్తయిన తర్వాత, మంత్రిత్వ శాఖ బహుశా కూర్చుని దానిపై ఆలోచిస్తుంది’ అని వివరించారు. భారత్‌లో క్రిప్టో భవిష్యత్తును చూస్తుందా అనే ప్రశ్నపై మాట్లాడుతూ… ‘చాలా మంది భారతీయులు దానిలో చాలా భవిష్యత్తును చూశారు, అందువల్ల నేను దానిలో ఆదాయాన్ని పొందే అవకాశాన్ని చూస్తున్నాను’ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img