Friday, April 26, 2024
Friday, April 26, 2024

భారత్‌ బోణీ

రజతాన్ని ముద్దాడిన మీరాబాయి చాను
హాకీలో పురుషుల జట్టు శుభారంభం
ఆర్చరీ, షూటింగ్‌లో నిరాశ
బ్యాడ్మింటన్‌లో చిరాగ్‌`సాత్విక్‌ ముందంజ

ఒలింపిక్స్‌ ఆరంభమైన రెండో రోజే భారత్‌ బోణీ కొట్టింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ మహిళల 49 కిలోల విభాగంలో 26 ఏళ్ల మీరాబాయి చాను రజతం సాధించి భారత్‌ పతకాల ఖాతాను తెరిచింది. స్నాచ్‌లో 87 కిలోల బరువుతో పాటు క్లీన్‌ అండ్‌ జర్క్‌ విభాగంలో 115 కిలోలు మొత్తంగా 202 కిలోల బరువును ఎత్తిన మీరాబాయి భారత్‌కు రజతాన్ని అందించింది. ఫైనల్‌లో చానూకి గట్టి పోటీ ఇచ్చిన చైనా లిఫ్టర్‌ హు జిహూయి 210 కిలోల బరువు ఎత్తి స్వర్ణంతో మెరిసింది. స్నాచ్‌ విభాగంలో తొలుత 84 కిలోల బరువు ఎత్తిన చాను, రెండోసారి 87 కేజీలు ఎత్తిడంలోనూ సఫలమైంది. అయితే మూడోసారి 89 కిలోల బరువును ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఇక క్లీన్‌ అండ్‌ జర్క్‌లో చాను తన ప్రత్యేకతను చాటుకుంది. తొలి ప్రయత్నంలో 110 కేజీల బరువు ఎత్తగా రెండో ప్రయత్నంలో 115 ఎత్తి చాను రజతాన్ని ఖాయం చేసుకుంది. స్వర్ణం రాదని తెలిసినా మూడో ప్రయత్నంలో 117 కేజీల బరువుకు ప్రయత్నించి విఫలమైనా రజతంతో భారత్‌ పతకాల ఖాతాను తెరిచింది. కరణం మళ్లీశ్వరి తర్వాత మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌ తరపున పతకం సాధించింది చానూ కావడం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్‌లో

రజత పతకం సాధించిన చానూకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్‌ చేయగా, టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్‌ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకమని ప్రధాని మోదీ అన్నారు.
హర్మన్‌ప్రీత్‌ డబుల్‌ థమాకా..
ఒలింపిక్స్‌లో హాకీలో పురుషుల జట్టు శుభారంభం అందుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 32 తేడాతో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (26ని, 33ని) స్వల్ప వ్యవధిలోనే రెండు గోల్స్‌తో ఆకట్టుకోగా, గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ప్రత్యర్థి ఎదురు దాడిని సమర్ధవంతంగా అడ్డుకుని భారత్‌కు తొలి విజయాన్ని అందుకునేలా చేశాడు. రూపిందర్‌పాల్‌ సింగ్‌ (10ని) భారత్‌ తరఫున తొలి గోల్‌ నమోదు చేశాడు. మ్యాచ్‌ మొదలైన ఆరో నిమిషంలోనే న్యూజిలాండ్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పెనాల్టీ కార్నర్‌ను కేన్‌ రసెల్‌ సద్వినియోగం చేసుకుని న్యూజిలాండ్‌ను ఆధిక్యంలోకి తీసుకు వచ్చాడు. అయితే మరో నాలుగు నిలిమషాల వ్యవధిలోనే రూపిందర్‌ గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆపై రెండు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. 26వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ గోల్‌ కొట్టి భారత్‌కు 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మరికొంత సేపటికే హర్మన్‌ప్రీత్‌ 33వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలవడంతో భారత్‌ 3-1తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ స్టీఫెన్‌ జోసెఫ్‌ గోల్‌ కొట్టి భారత్‌ ఆధిక్యాన్ని 32 తగ్గించాడు. ఆఖరి నిమిషాల్లో న్యూజిలాండ్‌ దుకుడు పెంచినా భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ భారత్‌ గోల్‌పోస్ట్‌కు గోడలా నిలిచి భారత్‌ను గెలిపించాడు. ఆదివారం రెండో మ్యాచ్‌లో భారత్‌ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
చిరాగ్‌- సాత్విక్‌ ముందంజ..
ఒలింపిక్స్‌ రెండో రోజున బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ప్రపంచ 3వ ర్యాంక్‌ జోడీపై చిరాగ్‌ శెట్టి – సాత్విక్‌ జోడి అద్భుత విజయం సాధించారు. చైనీస్‌ తైపీ ఆటగాళ్లు యాంగ్‌ లీ – చిన్‌ లిన్‌ వాంగ్‌ జోడీపై 21-16, 16-21, 27-25తో గెలుపొందింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ పోటా పోటీగా సాగగా, చివరికి భారత్‌ జోడీ పైచేయి సాధించింది. అయితే భారత స్టార్‌ షెట్లర్‌ 13వ సీడ్‌ సాయి ప్రణీత్‌ సింగిల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. ఇజ్రాయెల్‌ ఆటగాడు 47వ ర్యాంకర్‌ జిల్‌బర్మన్‌ మిషా చేతిలో 17-21, 15-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.
రెండో రౌండ్‌లో సుమిత్‌ నగల్‌..
భారత యువ టెన్నిస్‌ సంచలనం సుమిత్‌ నగల్‌ రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. దీంతో నగల్‌ 25 ఏళ్లలో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌ నెగ్గిన మూడో భారతీయుడిగా నలిచాడు. రెండున్నర గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో నగల్‌ డెన్నిస్‌ ఇస్టోమిన్‌పై 64,67,64 తేడాతో గెలుపొందాడు. రెండో రౌండ్‌లో నగల్‌ ప్రపంచ రెండో ర్యాంకర్‌ మెద్వెదేవ్‌ను ఎదుర్కోనున్నాడు. ఇక టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌లో మనికా బాత్రా రెండో రౌండ్‌ చేరింది. 10 మీ ఎయిర్‌ పిస్టల్‌లో సౌరభ్‌ నిష్క్రమణ.. షూటింగ్‌లో పతకంపై ఆశలు రేపిన సౌరభ్‌ చౌదరి 10 మీ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో నిరాశపరిచాడు. క్యాలిఫయింగ్‌లో టాప్‌లో నిలిచిన సౌరభ్‌ ఆపై ఎలిమినేషన్‌లో ఏడో స్థానానికి పరిమితమై ఈ విభాగం నుంచి తప్పుకున్నాడు. అభిషేక్‌ వర్మ సైతం ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. మహిళల 10 మీ ఎయిర్‌ పిస్టల్‌లో ఎలవేనిల్‌, అపూర్వీ చెండెలా గిరి తప్పింది. ఓడిన దీపికప్రవీణ్‌ జోడి..
ఆర్చరీలోనూ భారత్‌కు రెండో రోజు చేదు అనుభవం ఎదురైంది. మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో దీపికప్రవీణ్‌ జోడి పోరు క్వార్టర్స్‌లో ముగిసింది. దక్షిణ కొరియా జోడి చేతిలో దీపికప్రవీణ్‌ 2`6 తేడాతో ఓడారు. చైనా రెండు స్వర్ణం ఒక కాంస్య పతకాలతో పతకాల పట్టికల అగ్రస్థానం సాధించగా భారత్‌ రజత పతకంతో ఏడో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img