Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన డీజిల్‌
పెట్రో ధరల రోజువారీ పెంపు ఆగడం లేదు. గడిచిన తొమ్మిది రోజుల్లో ధరలు పెరగట ఇది ఎనిమిదవసారి. బుధవారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో దాదాపు రూపాయి చొప్పున పెరిగాయి. దీనితో గత 8 రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.5.60 చొప్పున పెరిగింది.
అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరల వల్లే.. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా పెంచినట్లు చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి.
దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటర్‌ 80 పైసలు పెరిగింది. దీనితో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.101.05 వద్ద ఉంది. ఇక రూ.92.31 వద్దకు చేరింది.
హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌ 91 పైసలు పెరిగి రూ.114.5 వద్దకు ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర 87 పైసలు పెరిగి.. రూ.100.69 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌?లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 88 పైసలు, 83 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్‌? పెట్రోల్‌ ధర రూ.115.16 వద్ద, డీజిల్‌ ధర లీటర్‌ రూ.101.02వద్ద ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.106.68 వద్ద (76 పైసలు పెరిగింది) ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర 76 పైసలు పెరిగి 96.74 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్‌ ధర 84 పైసలు పెరిగి లీటర్‌? రూ.106.44 వద్ద విక్రయమవుతోంది. లీటర్‌ డీజిల్‌ ధర 79 పైసలు పెరిగి రూ.90.47 వద్దకు చేరింది దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర లీటర్‌ రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర 84 పైసలు పెరిగి.. రూ.115.86 వద్ద ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర 85 రూ.100.08 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 84 పైసలు, 80 పైసల చొప్పున పెరిగింది. దీనితో లీటర్‌ పెట్రోల్‌? రూ.110.50 వద్ద, డీజిల్‌? లీటర్‌? రూ.95.4 వద్ద ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img