Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ముంబై జైలు నుంచి విడుదలైన రాజ్‌కుంద్రా

పోర్న్‌ చిత్రాల కేసులో అరెస్టు అయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇవాళ ఉదయం ముంబైలోని ఆర్థర్‌ రోడ్డు జైలు నుంచి విడుదలయ్యారు. పోర్నోగ్రఫీ కేసులో నిన్న ముంబై కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రూ.50,000 ష్యూరిటీతో ముంబై కోర్టు ఆయనకు సోమవారం బెయిలు మంజూరు చేసింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అశ్లీల వీడియోలను షూట్‌ చేసి.. ఓ యాప్‌ ద్వారా వాటిని అప్‌లోడ్‌ చేసినట్లు రాజ్‌కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ ఉదయం 11.30 నిమిషాలకు రాజ్‌కుంద్రా జైలు నుంచి బయటకు వచ్చారు. కుంద్రాకు బెయిల్‌ మంజూరైన కొద్ది గంటలకే శిల్పాశెట్టి ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా ‘’గ్రహణం వీడితే మళ్లీ మంచిరోజులు వస్తాయనడానికి సంకేతమే ఇంద్రధనుస్సు’’ అంటూ ఓ ట్వీట్‌ చేసింది.పోర్న్‌ చిత్రాల కేసులో సుమారు రెండు నెలల క్రితం రాజ్‌ కుంద్రా అరెస్టు అయ్యారు. ఈ కేసులో విచారణ పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున తన కు బెయిలు మంజూరు చేయాలని శనివారంనాడు ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో తనను బలిపశువును చేశారని, కేసులో తప్పుగా ఇరికించారని, పోర్న్‌ చిత్రాల షూటింగ్‌లో తన ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా తనపై చార్జిషీటు దాఖలు చేశారని బెయిల్‌ అభ్యర్థనలో రాజ్‌కుంద్రా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img