Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ముప్పుంది… మాస్కులు ధరించాల్సిందే

కోవిడ్‌ ఎక్స్‌ఈ ఆరోగ్య నిపుణుల సూచన
న్యూదిల్లీ : కోవిడ్‌19 కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈ ని దృష్టిలో ఉంచుకుని దేశంలో మాస్కుల స్వచ్ఛంద వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆరోగ్య సంరక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కరోనా వైరస్‌ అన్ని వేరియంట్‌లకు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైన జోక్యమని తెలిపారు. రెండేళ్ల తర్వాత మహారాష్ట్ర, దిల్లీలో తప్పనిసరిగా మాస్కులు ధరించడాన్ని ఎత్తివేశారు. కోవిడ్‌19 సంక్రమణ దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ మార్గదర్శకాలను పాటించకపోతే రూ.2 వేల వరకు జరిమానా విధించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన కరోనా మహమ్మారి ఒమిక్రాన్‌ ఉప రకం ఎక్స్‌ఈ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న కోవిడ్‌ వేరియంట్ల కంటే ఎక్స్‌ఈ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని సూచించింది. ఒమిక్రాన్‌కు చెందిన బీఏ.1, బీఏ.2 రెండు ఉప రకాల నుంచి ఈ కొత్త ఎక్స్‌ఈ వేరియంట్‌ ఉద్భవించింది. ఫిబ్రవరిలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన భారతదేశంపై కొత్త వేరియంట్‌ ప్రభావం గురించి అడిగినప్పుడు, భయపడాల్సిన అవసరం లేదని, అయితే బహిరంగంగా మాస్కులను స్వచ్ఛందంగా వినియోగించాలని నిపుణులు సూచించారు. మార్చి 12న వదోదర పర్యటనలో కోవిడ్‌-19కి పాజిటివ్‌గా తేలిన ముంబైకి చెందిన ఒక వ్యక్తి నుంచి తీసుకున్న నమూనా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఫలితాలను అధికారులు పొందడంతో గుజరాత్‌ శనివారం తన మొదటి ఎక్స్‌ఈ వేరియంట్‌ కేసును నివేదించిందని రాష్ట్ర అధికారి ఒకరు తెలిపారు. దీనికి ముందు, ముంబై పౌర మండలి అధికారులు మాట్లాడుతూ ఫిబ్రవరి చివరలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక మహిళకు మార్చిలో పాజిటివ్‌గా తేలిందని, అటుతర్వాత జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఆమెకు ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లు చెప్పారు. అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ దానిని ధ్రువీకరించలేదు. ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు టి.జాకబ్‌ మాట్లాడుతూ ఎక్స్‌ఇ అంటే ఇంతకు ముందు ఎక్స్‌ఎ, ఎక్స్‌బీ, ఎక్స్‌సీ, ఎక్స్‌డీ ఉన్నాయని, అయితే వాటిలో దేనినీ పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. ‘ఎక్స్‌ఈ బ్రిటన్‌లో సాధారణమైనప్పటి నుంచి దృష్టిని ఆకర్షించింది. ఒమిక్రాన్‌ ఉప రకమైన బీఏ.2 కంటే ఇది దాదాపు 10 శాతం అధిక వ్యాప్తి కలిగినది. కానీ మీడియాలో ఇది బీఏ.2 కంటే 10 శాతం తక్కువ వ్యాప్తి కలిగినది అంటూ కథనాలు వచ్చాయి. అందువల్ల, ఎక్స్‌ఈ తప్పుడు గుర్తింపు పొందింది’ అని ఆయన తెలిపారు. ‘ఫిబ్రవరి మూడవ వారంలో ఒమిక్రాన్‌ తరంగం (ప్రధానంగా బీఏ.2) తగ్గిన తర్వాత ఎక్స్‌ఈ గుర్తించిన తర్వాత అప్రమత్తత కోసం ఎటువంటి కారణం అవసరం లేదు. మన వ్యూహాల్లో ఎలాంటి మార్పు అవసరం లేదు. మాస్కులు కోవిడ్‌ మహమ్మారి నియంత్రణకే కాకుండా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. సాధారణంగా ఆరోగ్య విద్య ద్వారా ప్రచారం చేయాలి. పాటించనందుకు శిక్ష విధించడం చాలా అవసరం’ అని జాక్‌బ్‌ అన్నారు. పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొఫెసర్‌, లైఫ్‌కోర్స్‌ ఎపిడెమియాలజీ ప్రధానాధికారి గిరిధర ఆర్‌ బాబు మాట్లాడుతూ ఎక్స్‌ఈ వేరియంట్‌ను నివేదించడాన్ని నిఘా వ్యవస్థ బలంగా చూడాలని అన్నారు. భారతదేశంలో ఈ కొత్త రకం వేరియంట్‌ వ్యాప్తికి సంబంధించి మరింత సమాచారం వెలువడక ముందే ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ‘మాస్కుల స్వచ్ఛంద వినియోగాన్ని ప్రోత్సహించాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది అన్ని వేరియంట్‌లకు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైన ఏకైక జోక్యం. అయితే జరిమానా విధించడానికి బదులుగా, మాస్కుల లభ్యత, ఉచిత పంపిణీని నిర్ధారించడం, ముఖ్యంగా మూసివేసి ఉన్న గదుల్లో వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఇది దోహదపడుతుంది’ అని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img