Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మోదీకి ప్రధానిగా కొనసాగే అర్హతలేదు

కారుతో ఢీకొట్టి రైతులను చంపడం దారుణం
మాదక ద్రవ్యాల కేసులో సినీనటులతోపాటు అదానీని పట్టుకోవాలి
సీపీఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : గతంలో ఫ్యాక్టనిస్టులు తమ శత్రువులను లారీలతో తొక్కి చంపేవారని, ప్రస్తుతం కేంద్ర ప్రభు త్వం నిరసనకారులను కారుతోఢీకొట్టి చంపేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. లక్షల సంపాదన కోసం సముద్ర మార్గంగా డ్రగ్స్‌ సరఫరా చేసే అదానీ లక్షల కోట్లు ఇస్తామంటే మన దేశానికి టెర్రరిస్టులను సరఫరా చేసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే అదానీ తన ఓడరేవుల ద్వారా డ్రగ్స్‌ సర ఫరా చేశారని, ఆయనను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నిం చారు. మోదీ ఒక్క క్షణం ప్రధానిగా ఉంటే దేశానికే ప్రమాదం అని అన్నారు. హైదరాబాద్‌లోని మక్దుం భవన్‌లో బుధవారం ఆయన సీపీిఐ జాతీయ కార్య వర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న వారిని కారుతో గుద్ది చంపిన వారు రాజభోగాలు అనుభవిస్తున్నారనీ, బాధితులను జైలులో పెట్టారని, వారిని పరామర్శిం చేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను గృహనిర్భంధం చేస్తున్నారని విమర్శించారు. పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీని ఎందుకు అరెస్ట్‌ చేశారని, ఆమె రౌడీనా అని ప్రశ్నించారు. ఒక పక్క బాధితులు రోధిస్తుంటే, మరో పక్క మోడీ ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతోందని, ఇలాంటి కిరాతక ప్రధాని దొరుకు తాడా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, రాజ కీయ విధానాలు ప్రమాద కరంగా మారాయని విమ ర్శించారు. దేశ సంపదను, పన్నులను ఎగవేసి లక్షల కోట్లను విదేశాల్లో దాచి పెట్టుకున్నట్టుగా పండోరా పత్రాల ద్వారా వెల్లడైందన్నారు. దేశం తీవ్రమైన ఆర్థిక నేరస్థుల వ్యవస్థగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరినిచ్చే నవరత్నాల్లాంటి కేంద్ర రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ పరి రక్షణ కోసం, నాణ్యమైన విద్య కోసం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని, అందుకు అవసరమైతే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వాక్సిన్‌ ఇవ్వాలని సూచించారు. వచ్చే ఏడాది అక్టోబరు 14-18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్టు తెలిపారు. మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ డైరక్టరేట్‌ (ఇడి) చిల్లర కోసం విచారణ చేపడుతుందా? డ్రగ్స్‌ పట్టుకోవడం కోసమా అని నారాయణ ప్రశ్నించారు. డగ్స్‌ సేవించిన వారిని, సినీ రంగాల వారిని అరెస్ట్‌ చేస్తున్నారని, ఇందుకు మూలమైన తయారీ దారులను, సరఫరాదారులను పట్టుకోవడం లేదన్నారు. రాజీవ్‌ గృహకల్పను అమ్మితే జగన్‌ తన తండ్రిని అమ్ముకున్నట్లేనని నారాయణ అన్నారు. ‘ఆన్‌లైన్‌ క్లాసులు కాకుండా వంద శాతం విద్యార్థులతో తరగతులు నిర్వహించాలన్నారు. ఏపీలో డ్రగ్స్‌ కల్చర్‌ విచ్చలవిడిగా విస్తరిస్తోందనీ, ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా విజయవాడతో లింక్స్‌ ఉంటున్నాయన్నారు. సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ యూపీ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మోదీ తక్షణమే బాధ్యుడైన కేంద్ర మంత్రిని కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
సినీ నటులతో పాటు మాదకద్రవ్యాల అదానీలను కూడా పట్టుకోవాలి. దేశాన్ని ప్రైవేట్‌ పరం చేస్తోన్న మోదీకి ప్రధానిగా కొనసాగే అర్హత లేదు. ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ను టాటాకు అప్పగించటం సరైంది కాదు. తన కొడుకును చంపే ప్రయత్నం చేశారని కేంద్ర మంత్రి అనటం సరైంది కాదు. నిరసనలు తెలిపుతున్న బాధితులను పరామర్శించడానికి వచ్చినవారిని గృహ నిర్బంధం చేయటాన్ని ఖండిస్తున్నాను. కార్లతో గుద్దించి రైతులను చంపించి నేరం తన మీదకు రాకుండా కేంద్రం చూసుకుంటోంది’’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img