Friday, April 26, 2024
Friday, April 26, 2024

యూపీలో వర్ష బీభత్సం..12 మంది మృతి


లక్నోలో గోడ కూలి 9 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం చేస్తున్నాయి. వర్షాల కారణంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు. లక్నోలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో మైనర్లు, మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నావ్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలడంతో.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మోకాలి లోతు వరకూ నీరు నిలిచిపోయాయి. పలు చోట్ల కార్లు, బైకులు వరద నీటిలో తేలుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. లక్నోలోని దిల్‌కుశా ప్రాంతంలో ఓ సైనిక భవనం ప్రహారి గోడను ఆనుకుని కొంత మంది కూలీలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గురువారం కురిసిన భారీ వర్షానికి అర్ధరాత్రి సమయంలో ప్రహరీ గోడ కూలి గుడిసెలపై పడిరది. కూలీలు, వారి కుటుంబసభ్యులు శిథిలాల కింద చిక్కుకొని విలవిల్లాడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి 9 మృతదేహాలను బయటకు తీశారు. ప్రాణాలతో బయటపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img