Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రెండిరజన్ల ప్రభుత్వంతోనే అభివృద్ధి

యూపీలో ప్రధాని మోదీ
గోరఖ్‌పూర్‌ : రెండిరజన్ల ప్రభుత్వంతో (కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం) అభివృద్ధి వేగవంతమవుతుందని, గోరఖ్‌పూర్‌లో ప్రారంభించిన ప్రాజెక్టులే ‘నవభారతం’ నిర్మాణం సాధ్యమనే విషయాన్ని చాటుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో రూ.10,000 కోట్ల విలువైన మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మంగళవారం ప్రారంభించారు. రూ.8,600 కోట్లతో నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీ, రూ.1,011 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌-రీజినల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐసీఎంఆర్‌-ఆర్‌ఎంఆర్‌సీ)కు చెందిన హై-టెక్‌ ల్యాబ్‌ను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ గోరఖ్‌పూర్‌లో ఎరువుల ప్లాంట్‌, ఎయిమ్స్‌ ప్రారంభం కావడం ఎన్నో సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిందని చెప్పారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి రెట్టింపు వేగంతో దూసుకువెళ్తుందన్నారు. యూపీ అభివృద్ధిలో యోగి ఆదిత్యనాథ్‌ పాత్రను మోదీ ప్రశంసిచారు. ఆరోగ్య సేవలనేవి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. ఆ దిశగా యోగి సర్కార్‌ పనిచేస్తోందని చెప్పారు. గతంలో గోరఖ్‌పూర్‌లో మెదడువాపు రోగుల నమూనాలు సైతం పూనెకు పంపాల్సి వచ్చేదని, ఫలితాలు వచ్చేసరికి ఆ రోగి చనిపోవడమో, పక్షవాతం బారిన పడటమో జరిగేదని అన్నారు. ఇప్పుడు కరోనా వైరస్‌, మెదడువాపు, ఇతర వ్యాధుల పరీక్షలు గోరఖ్‌పూర్‌ని ప్రాంతీయ వైరల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లోనే చేయించుకోవచ్చని చెప్పారు. 2014కు ముందు యూరియా కొరత అనేది పతాక శీర్షికల్లో కనిపించేదదని, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిరదని చెప్పారు. యూరియా దుర్వినియోగాన్ని అరికట్టామని, కోట్లాది మంది రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులు ఇచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించే ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష దీనితో నెరవేరిందని, 1990లో మూతపడిన ఫ్యాక్టరీని 2014 వరకూ తిరిగి ప్రారంభించేందుకు ఎవరూ సాహసం చేయలేదని, బీజేపీకే అది చెల్లిందని చెప్పారు.
మారతారా లేదా మార్చమంటారా?
పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరవుతున్న బీజేపీ ఎంపీలను మోదీ మరోసారి మందలించారు. ఎంపీల బాధ్యతలను గుర్తు చేస్తూ, సభాకార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. పార్లమెంటుకు కిలోమీటరు దూరంలో ఉన్న అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో మంగళవారం ఉదయం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘మీరు మారండి లేదా మేమే మార్చాల్సి ఉంటుంది’ అని పరోక్షంగా గైర్హాజరీ ఎంపీలకు హెచ్చరిక చేశారు. ఎంపీల పేర్లను ఆయన నేరుగా ప్రస్తావించలేదు. ప్రజలకు చేరువ కావాలని, తమ తమ నియోజవర్గాల్లో ఈవెంట్లు నిర్వహించాలని, పద్మ అవార్డు గ్రహీతలను గౌరవించాలని ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఎంపీలకు ప్రధాని చేసిన సూచనలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు తెలియజేస్తూ పార్లమెంటు, స్పోర్ట్‌ కాంపటీషన్‌, హెల్తీ చిల్ట్రన్‌ కాంపటీషన్‌, సూర్యనమస్కార్‌ కాంపటీషన్‌ వంటివి నిర్వహించాలని ప్రధాని పిలుపునిచ్చారని, పద్మ అవార్డు గ్రహీతలతో లైవ్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని సూచించారని చెప్పారు. నవంబరు 15వ తేదీ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్‌ దివస్‌గా ప్రకటించినందుకుగాను ప్రధానికి ఎంపీలు అభినందనలు తెలియజేసినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img