Friday, April 26, 2024
Friday, April 26, 2024

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

తాజా నివేదికపై అసంతృప్తి
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ చెలరేగిన హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు సోమవారం మరోసారి ఆక్షేపించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన స్టేటస్‌ రిపోర్ట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది.మరింత మంది సాక్షులను విచారించామని ప్రస్తావించడం మినహా ఈ నివేదికలో ఏమీ లేదని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. హింసాకాండకు సంబంధించి 13 అరెస్టు చేయగా.. ఆశిష్‌ మిశ్రా ఫోన్‌ను జప్తు చేయడంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకూ పోలీసులు సేకరించిన ఆధారాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర కేసులకు సంబంధించిన సాక్ష్యాలను..ఈ కేసులు ఉపయోగించకూడదని స్పష్టంచేసింది. సీబీఐకి విచారణ బదిలీ చేయడానికి సుప్రీం నిరాకరించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img