Friday, April 26, 2024
Friday, April 26, 2024

లారీలకు దారేదీ..?

కృష్ణాకు ఆకస్మికంగా వరద
ఇసుక కోసం వెళ్లి నదిలో ఇరుక్కున్న 132 ట్రక్కులు

విశాలాంధ్ర`కంచికచర్ల : కృష్ణా జిల్లా నందిగామలో ఒక్కసారిగా పెరిగిన వరద కారణంగా.. నీటిలో 132 ఇసుక లారీలు చిక్కుకున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా కోసం వందకు పైగా లారీలు వెళ్లాయి. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా వరద రావడంతో లారీలన్నీ ర్యాంపులోనే నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరదనీటికి కొట్టుకుపోవడంతో వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన రెవిన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను నాటు పడవల సహాయంతో నదిలో నుంచి బయటకు తీసుకువచ్చారు. ఇసుక ర్యాంపులో ఉన్న లారీలను మాత్రం బయటకు తీసుకువచ్చే పరిస్థితి కనిపించటంలేదు.
అధికారుల నిర్లక్ష్యం వల్లేనా..?
జలవనరుల శాఖ అధికారులు అలసత్వం వల్లే లారీలు నదిలో ఇరుక్కు పోయే పరిస్థితి ఏర్పడిరదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సాగర్‌ నుంచి పులిచింతలకు, అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీటి విడుదలకు ముందు నదీ పరీవాహక గ్రామాలను అప్రమత్తంగా ఉండాలని జలవనరులు, రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరికలు చేస్తారు. ఇటీవల పులిచింతల గేటు కొట్టుకుపోయిన తరువాత నాలుగురోజుల పాటు హెచ్చరికలు చేశారు. ఆ తరువాత డెల్టా అవసరాల కోసం కేవలం పది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో నదిలో వరద తగ్గిపోయింది. దీంతో గత రెండు రోజులుగా గుత్తేదారు ఇసుక అమ్మకాలు ప్రారంభించటంతో వివిధ ప్రాంతాల నుంచి వందలాది లారీలు ఇసుక కోసం చెవిటికల్లు ర్యాంపుకు వచ్చాయి. ముందస్తు హెచ్చరిక లేకుండా పులిచింతల నుంచి 75 వేల క్యూసెక్కులు, మునేరు నుంచి 5 వేల క్యూసెక్కుల వరద నీరు ఆకస్మికంగా చెవిటికల్లు వద్ద నదికి చేరుకోవ టంతో ఈ పరిస్థితి ఏర్పడిరది.సాగర్‌ నుంచి నీటి విడుదల పెరగడం, పులిచింతల వద్ద ఎగువ నుంచి వచ్చే వరద నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో లారీలను నది నుంచి బయటకు తెచ్చేందుకు అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. నందిగామ రూరల్‌ సీఐ నాగేంద్రకుమార్‌, ఎస్‌ఐలు సుబ్రహ్మణ్యం, లక్ష్మీ, రెవిన్యూ సిబ్బంది కృష్ణానది వద్ద ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img