Friday, April 26, 2024
Friday, April 26, 2024

వికలాంగులకు ఇంటి వద్దనే కరోనా టీకా

కేంద్రం స్పందన కోరిన సుప్రీం
న్యూదిల్లీ : దేశంలోని వికలాంగులకు రెండువారాల్లో వారి ఇంటి వద్దనే కోవిడ్‌`19 టీకాలు అందించే విషయంపై స్పందించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నోటీసులు జారీ చేసింది. కోవిన్‌ పోర్టల్‌ ద్వారా కాకుండా వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించేలా ఇంటి వద్దకే టీకాలు ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్ధిస్తూ ఒక ఎన్జీవో దాఖలు చేసిన పిటీషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ురియు వికలాంగులకు అంకితమైన హెల్ప్‌లైన్‌, వికలాంగులకు సాధ్యమయ్యే మేరకు ఇంటింటికీ టీకాల స్వభావం నుండి ఉపశమనం పొందాలని పిటిషన్‌ పేర్కొంది. పిటిషన్‌ తరపున అడ్వకేట్‌ పంకజ్‌ సిన్హా, వాదనలు వినిపిస్తూ వికలాంగులకు ప్రత్యేకంగా టీకాలు ఇవ్వవలసిన అవసరాన్ని కోర్టుకు తెలిపారు. జార్ఖండ్‌, కేరళ రాష్ట్రాల్లో వికలాంగుల ఇళ్ల వద్దనే టీకాలు ఇచ్చే కార్యక్రమం విజయవంతమైందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కొంత సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం రెండువారాల్లో టీకాల కార్యక్రమం ఈ విషయంపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేస్తామని భవిష్యత్తులో రాష్ట్రాలుచ కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా నోటీసు జారీ చేయాల్సిన అవసరముంటే స్పందిస్తామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img