Friday, April 26, 2024
Friday, April 26, 2024

వినాశకర సాగు చట్టాలు రద్దుచేయాల్సిందే

27న బంద్‌కు జగన్‌, బాబు మద్దతు ప్రకటించాలి
నెల్లూరు సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

దేశ సంపద వృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ దేశసంపదను తెగనమ్ముతూ దేశాన్ని దివాళా తీయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతుసంఘాల సమాఖ్య ఈ నెల 27న నిర్వహించతలపెట్టిన బంద్‌లో చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలు ప్రత్యక్షంగా పాల్గొని బంద్‌కు మద్దతు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

విశాలాంధ్ర బ్యూరో` నెల్లూరు : దేశ సంపద వృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ దేశసంపదను తెగనమ్ముతూ దేశాన్ని దివాళా తీయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను కార్పొరేట్‌ పరం చేయడమే లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసి ఆంధ్రుల ఆత్మాభి మానం దెబ్బతినేలా వ్యవహరిస్తూ, పరిశ్రమను నూటికి నూరు శాతం అమ్ముతామని పదేపదే ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతుసంఘాల సమాఖ్య ఈ నెల 27న నిర్వహించతలపెట్టిన బంద్‌లో తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలు ప్రత్యక్షంగా పాల్గొని బంద్‌కు మద్దతు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కడప ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, దేశ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు తెగనమ్ముతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఐ ప్రారంభించిన జన్‌ఆందోళన్‌ పాదయాత్రలో భాగంగా శనివారం నెల్లూరు నగరంలో పాదయాత్ర నిర్వహిం చారు. ఆర్టీసీ బస్టాండ్‌నుంచి కనకమహల్‌ సెంటరు వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు కళాకారుల అటపాటలతో యాత్ర సాగింది. దారిపొడవునా సీపీిఐ, విద్యార్ధి యువ జన సమాఖ్యల కార్యకర్తలు ర్యాలీకు ఘన స్వాగతం పలుకుతూ, పూల వర్షం కురిపిస్తూ యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రైతన్న అనేక రకాలుగా నష్ట పోతున్నప్పుడు ఆదుకోవా ల్సిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చి వ్యవసాయరంగాన్ని ధ్వంసం చేయాలని చూడడాన్ని నిరసిస్తూ 300 రోజులు పైచిలుకు రైతులు ఢల్లీి నడిబొడ్డున ఆందోళన చేస్తున్న సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందనీ, చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు లేవు కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని, రైతుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, వ్యవసాయ కూలీలకు పని కల్పించకుండా కేవలం కార్పొరేట్‌ శక్తులు అయిన అంబానీ, ఆదానీలకు కోట్లాది రూపాయలు దోచి పెట్టడానికి మోడీ ప్రభుత్వం ఉందని తీవ్రంగా విమర్శిం చారు. మోదీకి భయపడి, వ్యక్తి గత కేసులకోసం రాజీపడి ఆయన విధానాలను బలపరుస్తూ జగన్‌ నీచపాలన అందిస్తున్నాడని ,పరిపాలన చేతకాక ప్రజలపై విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీల పేరుతో 3,699 కోట్ల రూపా యల అదనపు భారం మోపడం దారుణమన్నారు. వెంటనే ట్రూ అప్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. యాత్రలో భాగంగా గాంధీబొమ్మ వద్ద కారు స్టాండు వద్ద కారు ఓనర్స్‌ను పార్టీలోకి ఆహ్వానించి పార్టీజెండా ఆవిష్కరించారు. ఈ యాత్రలో సీపీిఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాధ్‌రెడ్ది , ఏఐటీయూసీి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వి.జయ లక్షిలు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్‌.ప్రభాకర్‌, సహాయ కార్యదర్శి దామాఅంకయ్య కార్యవర్గసభ్యులు వి.రామరాజు, అరిగెల నాగేంద్రసాయి, కె.వినోదిని, డేగా సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు పముజుల దశరధరామయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్య క్షులు కె.ఆంజనేయులు, నాయకులు టి.శ్రీనివాసు లురెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు సూరిశెట్టి నాగేంద్ర, నందిపోగు రమణయ్య, నందయ్య, చల్లా నరసయ్య, విద్యార్థి యువజన సంఘాల నాయకులు వాటంబేటి నాగేంద్ర, సునీల్‌, సిరాజ్‌, కమల్‌, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.దర్గాబాబు, పి.బాలక్రిష్ణా, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కల్లూరి జాన్‌, ముక్తార్‌, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం, టీడీపీ సంఫీుభావం :
సీపీిఐ పాదయాత్రకు సీపీఎం, తెలుగుదేశం పార్టీ సంఫీుభావాన్ని తెలిపాయి. సీపీిఎం నగర కార్యదర్శి మూలం రమేష్‌, నాగేశ్వరరావు, బాష, సూర్యనారాయణ తదితరులు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, నుడా మాజీ డైరెక్టర్‌ ఖాజావలి, సీపీఐ కార్యాలయంలో రామకృష్ణను కలిసి తమ సంఫీుభావాన్ని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img