Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైఎస్‌ షర్మిల అరెస్టు

లోటస్‌పాండ్‌ వద్ద తోపులాట

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా షర్మిలను అరెస్ట్‌ చేశారు. షర్మిల కారుతో ఢీ కొనడంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యా యని పోలీసులు చెబుతున్నారు. పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన కేసులో వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్‌ షర్మిలపై నాలుగు సెక్షన్ల నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద వైఎస్‌ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్‌ షర్మిలపై బంజారా హిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా ఆమెను జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి వైఎస్‌ షర్మిలను కోర్టుకు తరలించనున్నారు. కోర్టుకు తరలించడానికి ముందు వైఎస్‌ షర్మిలను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ విషయంలో సిట్‌ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందకు బయలు దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఉదయం 10:30 గంటలకు లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరు తుండగా పోలీసులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయాన్ని ముట్టడిరచారు. బయటకు వెళ్లేందుకు అనుమతిలేదని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు. లోటస్‌ పాండ్‌ వద్ద షర్మిల కారు ఎక్కే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే షర్మిల పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌పై ఆమె చేయిచేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. షర్మిల అరెస్టుపై డీసీపీ జోయల్‌ డేవిస్‌ స్పందించారు. పోలీసులపై షర్మిల దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. షర్మిల సిట్‌ ఆఫీసుకు వెళ్తారనే సమాచారం ఉందని.. అందుకే ఆమెను ముందస్తుగా అరెస్టు చేయడానికి ప్రయత్నించామని వివరించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు పెడతామని తెలిపారు. ఎస్సై ఫిర్యాదు ఆధారంగా షర్మిల కేసులో ముందుకెళ్తామని సీవీ ఆనంద్‌ వెల్లడిరచారు. కాగా ఈ ఘటనపై వైఎస్సార్‌టీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఒంటరిగానే వెళ్లాలనుకున్నా: షర్మిల
సిట్‌ కార్యాలయానికి తాను ఒక్కదాన్నే వెళ్లాలని అనుకున్నానని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల వెల్లడిరచారు. సిట్‌ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నానని తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్న ప్పుడు తమ అనుమానాలను అధికారికి చెప్పడం బాధ్యతగా భావించానని అన్నారు. సిట్‌ ఆఫీస్‌ కి వెళ్లడానికిఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని షర్మిల తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img