Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైరస్‌లు వ్యాపిస్తున్నాయి… జాగ్రత్తగా ఉండాల్సిందే : డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

కోవిడ్‌ వైరస్‌ కేసులు తగ్గాయని నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వివిధ రకాలైన వైరస్‌లు వేగంగా వ్యాప్తిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. నిర్లక్ష్యంగా ఉంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చింది. వైరస్‌ల వ్యాప్తిని అరికట్టే విషయంలో పలు దేశాలు అలసత్వం వహిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు అన్నారు.కోవిడ్‌ విజృంభణ తగ్గింది. కానీ నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది ఎందుకంటే చాలా వైరస్‌లు అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించింది. కోవిడ్‌ తగ్గుదలతో వైరస్‌ల వ్యాప్తి కట్టడిపై పలు దేశాలు అలసత్వం వహిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు అన్నారు.కోవిడ్‌, ప్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్‌లతో పాటు ఇతర వ్యాధి కారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయని డబ్యూహెచ్‌వో కోవిడ్‌ సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్‌ కేరోవ్‌ అన్నారు. అందరూ సురక్షితంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం, మాస్క్‌లు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రంగా ఉండడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మారియా వాన్‌ కెరోవ్‌ చెప్పారు.ఇదే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా 500లకుపైగా ఒమిక్రాన్‌ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని వాన్‌ వెల్లడిరచారు. ఈ వేరియంట్ల వ్యాప్తి, రోగ నిరోధకత నుంచి అవి ఏ విధంగా తప్పించుకుంటున్నాయి. వాటి తీవ్ర వంటి అంశాలు పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఈ సీజన్‌లో 1.3 కోట్ల శ్వాసకోశ సంబంధ కేసులు నమోదు కాగా, 1.20లక్షల మంది ఆస్పత్రిలో చేరారని తెలిపారు. అదేవిధంగా 7,300 ప్లూ మరణాలు సంభవించినట్లు సీడీసీ నివేదిక వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img