Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సమాచారం అడిగితే చంపేస్తున్నారు

సవాల్‌గా ఆర్టీఐ అర్జీదారుల రక్షణ
పెరుగుతున్న హత్యలు, వేధింపులు
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా నివేదిక వెల్లడి

న్యూదిల్లీ : దేశంలో ఆర్టీఐ దరఖాస్తుదారుల హత్యలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. రాబోయే కాలంలో వారి భద్రత పెద్ద సవాల్‌గా మారబోతోందని ఆర్టీఐ చట్టం అమలు స్థితిపై కొత్త నివేదిక పేర్కొంది. ఆర్టీఐ డే సందర్భంగా సోమవారం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా ఈ నివేదికను విడుదల చేసింది. 1516 ఏళ్లలో కనీసం 95100 మంది ఆర్టీఐ దరఖాస్తుదారులు హత్యకు గురికాగా 190 మందిపై దాడులు జరిగాయి, పదుల సంఖ్యలో ఆత్మహత్యలు సంభవించగా వంద లాది మంది వేధింపులకు గురైనట్లు నివేదిక పేర్కొంది. సమాచారం కోరి ప్రాణాలు కోల్పోయిన ఆర్టీఐ కార్యకర్తల గురించిన డేటా ప్రభుత్వం వద్ద ఉండటం లేదని ‘రాష్ట్ర పారదర్శకత నివేదిక 2021’ పేరిట ఎన్జీవో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా (ఐఐటీ) వెలువరించింది. ఆర్జీఐ దరఖాస్తుదారుల హత్యలు, వేధింపులు దేశంలో పెరుగుతుండటంతో వీరి రక్షణ రాబోయే కాలంలో పెద్దసవాల్‌గా మారుతుందని నివేదిక పేర్కొంది. పట్టణ`గ్రామీణ ప్రజల్లో ఈ చట్టం వినియోగంలో మైక్రోస్థాయి అధ్యయ నాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని తెలిపింది. 2005, అక్టోబరు 12న ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చింది. ఏళ్ల తరబడి సమాచార కమిషనర్లు లేకుండా సమాచార కమిషన్లు పనిచేస్తున్నాయని ప్రధానంగా పేర్కొంది. ఆర్టీఐ చట్టం కింద అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించడంలో విఫలం అవుతున్నట్లు వెల్లడిరచింది. ప్రస్తుతానికి 165కుగాను 36 చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌, ఇన్ఫర్మేషన్‌ కమిషనర్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఆర్టీఐ సమాచార అర్జీల పరిష్కారానికి కాలపరిమితి ఉండటం సబబుగా ఉంటుందని మద్రాసు హైకోర్టు ఇటీవల సూచిం చిన విషయాన్ని ప్రస్తావించింది. ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చి 17 ఏళ్లు అయింది. కోవిడ్‌ నేపథ్యంలో సమాచార శాఖ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతీయ రాష్ట్రాల్లో ఆర్టీఐ అమలుపై దృష్టి పెట్టేందుకు ఇదే సమ యం. చట్ట ప్రకారంగా దీని అమలు జరుగుతుందా లేదా అన్నది ముఖ్యం అని టీఐఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామ నాథ్‌ రaా అభిప్రాయపడ్డారు. పరిపాలన తీరును మార్చే సామర్థ్యం ఆర్టీఐ చట్టానికి ఉందని భోపాల్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అజయ్‌ దూబే అన్నారు. ఆర్టీఐ దరఖా స్తులు, అప్పీళ్లు చాలా వరకు వ్యక్తిగతమైనవిగా ఉండటం కూడా మరొక సమస్యగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆర్టీఐ దరఖాస్తులను ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజా సమస్యలపై ఎక్కువగా దాఖలైతే వాటి ఉద్దేశం నెరవేరు తుందని తెలిపింది. మొబైల్‌ కనెక్టివిటీ, మొబైల్‌ యాప్‌ లతో పాటు అనేక వేదికల ద్వారా ప్రభుత్వ వెబ్‌సైట్‌ల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించడం నేటి టెక్‌ ప్రపంచంలో పెద్ద సమస్య కాదని, బహుళ భాషల్లో అనేక మాధ్యమాలు అందుబాటులో ఉన్నందున ఈ వ్యవస్థ మరింత పారదర్శంగా మారుతుందని నివేదిక పేర్కొంది. ‘అజ్ఞాత’ ఫిర్యాదులకు అనుమతి ఇవ్వాలని, ఫిర్యాదులను తిరస్కరిస్తే అందుకు తగిన సమాధానం/ వివరణ ఇవ్వాలని, వాటిని తిరిగి అప్పీలు చేసే ఆస్కారం ఉండాలని టీఐఐ నివేదిక సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img