Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సరికొత్త చరిత్రను లిఖించాం

టీకాల పంపిణీలో వంద కోట్ల మార్కును దాటడంపై ప్రధాని మోదీ
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భారత్‌ చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. రికార్డు స్థాయిలో డోసులు వేసిన ఘనత సాధించింది. ఇప్పటివరకు బిలియన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ప్రజలకు ఇచ్చారు. దీంతో చైనా తర్వాత బిలియన్‌ డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్‌ నిలిచింది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని మొత్తం 94.4 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్నది. రికార్డును సాధించేందుకు కృషి చేసిన ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘సరికొత్త చరిత్రను లిఖించాం.130 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషి, భారత సైన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ విజయాన్ని మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో మనం వంద కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. మోదీ ఇవాళ ఉదయం దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిని సందర్శించి ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందిని అభినందించారు.
కాగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో చరిత్రాత్మక రికార్డును చేరుకున్న సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఓ పాటను ఆవిష్కరించడంతోపాటు ఢల్లీిలోని ఎర్ర కోట వద్ద అతి పెద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img