Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘సివిల్స్‌’లో తెలుగు అభ్యర్థుల సత్తా

వందలోపు ర్యాంకుల్లో నలుగురు
మొత్తం 761 మంది ఎంపిక

న్యూదిల్లీ : సివిల్‌ సర్వీసుల పరీక్ష`2020 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) శుక్రవారం విడుదల చేసింది. సివిల్స్‌లో బీహార్‌కు చెందిన శుభం కుమార్‌ మొదటి ర్యాంకు సాధించాడు.
అయితే తెలుగు అభ్యర్థులు వందలోపు నాలుగు ర్యాంకులను సాధించి సత్తా చాటారు. ఈ ఫలితాలలో రెండవ ర్యాంకును జాగృతి అవస్థీ, అంకితా జైన్‌ మూడవ ర్యాంకు, యష్‌ జలుకా నాల్గవ ర్యాంకు, మమితా యాదవ్‌ ఐదో ర్యాంకు, మీనా కె ఆరవ ర్యాంకు, ప్రవీణ్‌ కుమార్‌ ఏడవ ర్యాంకు, జీవని కార్తీక్‌ నాగ్జిభాయ్‌ ఎనిమిదవ ర్యాంకు, ఆపాలా మిశ్రా 9వ ర్యాంకు, సత్యం గాంధీ పదవ ర్యాంకు సాధించారు. మొత్తం 761 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్‌సీ తెలిపింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు ఎంపికయ్యారు. తెలుగు అభ్యర్థిని పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయ నాయుడు 27వ ర్యాంకు, దేవగుడి మౌనిక 75వ ర్యాంకు, రవికుమార్‌ 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి 93, కె.సౌమిత్‌ రాజు 355, తిరుపతి రావు 441, ప్రశాంత్‌ సూరపాటి 498, డి.విజయ్‌ బాబు 682, ఇ.వేగిని 686, కళ్లం శ్రీకాంత్‌ రెడ్డి 747వ ర్యాంకు సాధించారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్‌ ఐఐటీ బాంబేలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేశారు. రెండవ ర్యాంకు సాధించిన జాగృతి అవస్థీ భోపాల్‌ నిట్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌ పూర్తి చేశారు. కాగా 2015లో యూపీఎస్‌సీ సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన దాబి సోదరి రియా దాబి 15వ ర్యాంకు సాధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img