Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీపీఐ జాతీయ కార్యవర్గం కీలక భేటీ

కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

న్యూదిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యవర్గం దిల్లీలో శనివారం సమావేశమైంది. మూడు రోజుల పాటు జరిగే జాతీయ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా తొలి రోజు కార్యవర్గం భేటీ అయింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యద ర్శులు కె.రామకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌), చాడ వెంకటరెడ్డి (తెలంగాణ) హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై కార్యవర్గం చర్చించింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పార్టీ ముసాయిదాపై కార్యవర్గం సుదీర్ఘ చర్చ జరిపింది. పార్టీ కౌన్సిల్‌ సమావేశాలు 14వ తేదీ సాయంత్రం ముగియనున్నాయి. ఈ సమావేశంలో ముసాయిదాపై తీర్మానం చేయనున్నారు. అక్టోబరులో విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిసింది. సాయంత్రం సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ప్రారంభమ య్యాయి. డి.రాజా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై నివేదిక సమర్పించారు. పార్టీ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆది, సోమవారాలు వీటిపై సభ్యులు చర్చిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జరుగుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గం, సమితి సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడిరది. పంజాబ్‌లో ఆప్‌ భారీ విజయం సాధించగా, మిగిలిన నాలుగు రాష్ట్రాలు` ఉత్తరప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌, గోవా, మణిపూర్‌లలో బీజేపీ అధికారబలంతో గెలిచింది. పైగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఈ ఐదు రాష్ట్రాల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొత్తగా జాతీయ ఫ్రంట్‌ ఏర్పాటైతే దానికి కాంగ్రెస్‌ నేతృత్వం వహించాలని ఆరాటపడుతున్నప్పటికీ, ఈ తాజా ఫలితాలు ఆ పార్టీకి షాకిచ్చాయి. అందుకే బీజేపీ, కాంగ్రెస్సేతర పక్షాలు ఒకదారిలో వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందన్న వాదన విన్పిస్తోంది. భావసారూప్యత గల పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ప్రగతిశీల శక్తులు కోరుకుంటున్నాయి. ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై పడబోదని రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపే తృతీయ శక్తులన్నీ ఒకచోటకు రావడానికి ప్రయత్నాలు మొదలుకావాలన్నది ప్రాంతీయ పార్టీల ఆకాంక్ష. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంత ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నింటిపైనా సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img