Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సోనూసూద్‌ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేశారు..

: ఐటీ శాఖ
ప్రముఖ నటుడు సోనూసూద్‌ రూ.రూ.20కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం శనివారం వెల్లడిరచింది. వరుసగా మూడు రోజుల పాటు శోధించిన ఆదాయపుపన్నుశాఖ ఈ మేరకు తేల్చి చెప్పింది.పన్ను ఎగవేత ఆరోపణలతో..అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడిరది. అలాగే ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించి క్రౌడ్‌ ఫండిరగ్‌ ప్లాట్‌ ఫాం ను ఉపయోగించి సోనూసూద్‌ విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించారని ఆదాయపుపన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. సోనూసూద్‌ ఇళ్లు, అతని కార్యాలయాల్లో మూడు రోజుల పాటు జరిపిన దాడుల్లో పన్ను ఎగవేతకు సంబంధించి పలు పత్రాలు గుర్తించినట్లు ఐటీశాఖ అధికారులు చెప్పారు. నిరుపేదలకు సహాయపడేందుకు గత ఏడాది జులై నెలలో సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ ను స్థాపించారు. సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రూ.18 కోట్ల విరాళాలను సేకరించగా, అందులో 1.9 కోట్లను సహాయపనులకు ఖర్చు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇటీవల ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ యొక్క ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశ్‌ కా మెంటార్స్‌ అనే సంస్థకు బ్రాండ్‌ అంబాసిడరుగా పనిచేస్తున్నట్లు సోనూసూద్‌ ప్రకటించిన నేపథ్యంలో ఐటీ శాఖ సోదాలు జరపడంపై ఆమ్‌ఆద్మీపార్టీ, శివసేన విమర్శలు గుప్పిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img