Friday, April 26, 2024
Friday, April 26, 2024

1న మరో ‘గులాబ్‌’


న్యూదిల్లీ : ఇప్పటికే అనేక రాష్ట్రాలను అతలాకుతలం చేసిన గులాబ్‌ తుపాను ప్రస్తుతానికి బలహీనపడిరది. ఈనెల 30న అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుంది. ఆపై తిరిగి బలపడి మరొక తుపానుగా మారుతుంది. పాకిస్థాన్‌ వైపునకు కదులుతుంది అని భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం వెల్లడిరచింది. గులాబ్‌ తుపాను బలహీనంగా ఉన్నప్పటికీ దీని ప్రభావంతో గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో మోసరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గల్ఫ్‌ ఆఫ్‌ కంభాట్‌ సమీపంలోని దక్షిణ గుజరాత్‌లో అల్పపీడనం ఏర్పడిరదని, అది ఈశాన్యంగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించి గురువారానికి వాయుగుండంగా మారుతుందని, అక్టోబరు 1న పాకిస్థాన్‌ మాక్రాన్‌ తీరం వెంబడి ప్రయాణిస్తుందని ఐఎండీ వెల్లడిరచింది. ఈ తుపాను ప్రభావంతో గుజరాత్‌లోని కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో మోస్తరు లేక భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలింది. అలాగే, దామన్‌, డయ్యూ, దాదర్‌`నాగర్‌ హవేలీలో భారీ వర్షాలు కురవచ్చునని అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img