Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

38 పాఠశాలల్లో సున్నా ఫలితాలు

. ఈ ఏడాదీ అమ్మాయిలదే హవా
. టెన్త్‌లో 72.26 శాతం ఉత్తీర్ణత
. పార్వతీపురం ప్రథమం
. నంద్యాల అథమం
. జూన్‌ 2 నుంచి సప్లిమెంటరీ
. మే 7 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు
. ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షకు హాజరు కాగా 4,37,196 మంది (72.26%) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 69.27 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా 75.38 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించి బాలురు కంటే 6.11 శాతం పైచేయి సాధించారు. విజయవాడ గేట్‌ వే వివంత హోటల్‌లో శనివారం పది పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మంత్రి బొత్స ఫలితాలు వివరాలు వెల్లడిస్తూ 87.47% ఉత్తీర్ణత సాధించి పార్వతీపురం మన్యం జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని, 60.39 శాతంతో నంద్యాల జిల్లా చివరిలో ఉందని తెలిపారు. 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా…ఏపీి రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 95.25 శాతం అత్యధికంగా ఉత్తీర్ణత సాధించి నట్లు తెలిపారు. 38 పాఠశాలల్లో జీరో ఫలితాలు వచ్చాయన్నారు. ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలను పాఠశాల వారీగా, సబ్జెక్టు వారీగా విశ్లేషిస్తున్నా మని, వచ్చే విద్యాసంవత్సరంలో అవి పునరా వృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తామని మంత్రి వెల్లడిరచారు. తప్పిన విద్యార్థు లకు జూన్‌ 2 నుండి 10వ తేదీ వరకూ సప్లిమెం టరీ పరీక్షలు నిర్వహిస్తామని, దీనిపై వివరణాత్మ కంగా త్వరలో టైంటేబుల్‌ ప్రకటిస్తామన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్ణీత సమయంలో సర్టిఫికెట్లు సంబంధింత పాఠశాలలకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే 13వ తేదీలోగా సీఎఫ్‌ఎంఎస్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ సిటిజెన్‌ చలానా ద్వారా ప్రతి సబ్జెక్టుకు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చి ఇంగ్లీష్‌ మీడియం సబ్జెక్టుగా 80.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి విశ్లేషించారు. తప్పిన విద్యార్థులు అధైర్య పడ వద్దని, దీనిని సవాల్‌గా తీసుకుని సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిం చాలన్నారు. పిల్లలను తల్లితండ్రులు ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తప్పిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షకు తయారుచేస్తామన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం మే 7 నుండి 17వ తేదీ వరకూ ఫీజు చెల్లించాలని, 50 రూపాయల అపరాధ రుసుముతో మే 18 నుండి 22 వరకూ ఫీజు చెల్లించే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ తన స్కూల్‌ డేస్‌ నాటి పద్యాన్ని విద్యార్థుల తల్లితండ్రులకు మోటివేషన్‌గా చదివి వినిపించారు. ప్రయత్నం చేసే వారికి ఎప్పటికీ అపజయం ఉండదని, చిన్న అవాంతరాలు ఎదురైనా అధైర్య పడకూడదని, ఓటమిని సవాల్‌గా స్వీకరిస్తే, తరువాత విజయం మనల్ని వరిస్తుందని ఆ పద్యానికి తాత్పర్యాన్ని ప్రవీణ్‌ ప్రకాశ్‌ వివరించారు. అనంతరం ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులు, గుర్తింపు కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని ‘సింగిల్‌ విండో ఆన్‌లైన్‌ పోర్టల్‌’ ను మంత్రి బొత్స ప్రారంభించారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌ కుమార్‌, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానంద్‌ రెడ్డి, డైరెక్టర్‌ (కోఆర్డినేషన్‌) పి.పార్వతి, ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరెడ్డి, కేజీడీవీ సెక్రటరీ మధుసూదనరావు, జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వా రామలింగం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img