Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమరావతి రైతులకు మద్దతుగా సిపిఐ సంఘీభావ బైక్ ర్యాలీ

మంగళగిరి టు అమరావతి బైక్ ర్యాలీ నిర్వహించిన సిపిఐ నేతలు

మంగళగిరి : జై అమరావతి అంటూ కదం తొక్కిన సిపిఐ నేతలు కదం త్రోక్కారు శుక్రవారం అమరావతి రైతుల దీక్షలు 1200 వందల రోజులు చేరుకున్న సందర్బంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ,సిపిఐ నేతలు మంగళగిరి సిపిఐ కార్యాలయం (వేముల పల్లి శ్రీ కృష్ణ భవన్) వద్ద నుండి మంగళగిరి పాత బస్ స్టాండ్,గౌతమ్ బుద్ధా రోడ్డు మీదుగా నవులూరు, ర్రబాలెం,పెనుమాక కృష్ణయ్యపాలెం,వెంకటపాలెం,మందడం దిక్ష శిబిరాలలో దీక్ష చేస్తున్న రైతులకి సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ,మాట్లాడుతూ
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అమరావతి ఉద్యోమం 1200వందల రోజుల పాటు సాగటం గొప్ప విషయమని
అమరావతి ఉద్యమం సుదీర్ఘ పోరాటంమని ఆన్నారు.
1200 వందల రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆన్నారు.
ముందస్తుకు వెళ్తే ఘోర‌ ఓటమిపాలై ముందుగా ఇంటికి వెళ్లడం ఖాయమని మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతిని ఏకైకరాజధానిగాప్రకటించాలని
డిమాండ్ చేశారు.రైతులు రైతు కూలీలు నిరసన దీక్షలు చేపట్టి నేటికీ 1200 రోజులకు చేరుకుందని ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా ప్రభుత్వానికి ప్రతికూల తీర్పు వచ్చిందని బీజేపీ నేతలు రాష్ట్రంలో జగన్ ను విమర్శిస్తూ ఢిల్లీలో మాత్రం వత్తాసు పలుకుతున్నారని మెడలు వంచుతానని… మోకాళ్ళ వద్దకూర్చున్నారని
విమర్శించారు.ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు వంటి వాటిపై కేంద్రం మెడలు వంచుతానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం మోకాళ్ల వద్ద కూర్చున్నారని అన్నారు.జగన్ కోరుకున్న విశాఖలోనే ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిని విద్యావంతులు చిత్తుగా ఓడించారు.
కేసులు పెట్టి బెదిరించినా వెనుకడుగు వేయలేదని ఆన్నారు.1200 రోజులుగా రైతులు రైతు కూలీలు మహిళలు అమరావతి సాధన కోసం ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం కేసులు పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదని ఆన్నారు.అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని విశాఖలో వైసీపీ నేతలు 40 వేల ఎకరాలను కబ్జా చేసినట్లు చెబుతున్నారని దీనిని బట్టి అక్కడ రాజధానిని ఏర్పాటు విషయమై అక్కడ ప్రజలు కూడా సానుకూలంగా లేరని ఆన్నారు.రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రజలను కూడా మోసం చేశారని అన్నారు.ఇప్పటికైనా మూడు ముక్కలాట మానుకొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.సియం జగన్ మోహన్ రెడ్డీ విజ్ఞతను చాటుకోవాలని అన్నారు.
175 లో ఒక అంకె ఎగరటం ఖాయంమని ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము 175 స్థానాల్లో గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి తరచూప్రకటిస్తున్నారు. ఇదంతా ఓ మైండ్ గేమ్ అని 175 లో ఒక అంకె ఎగరటం మాత్రం కచ్చితంగా జరిగి తీరుతుందని అన్నారు.
జగన్ ఇంటికి వెళ్తే రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని అప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతుంది పోలవరం నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు.ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రభుత్వ తీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని
విద్యావంతులు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకోవటం లేదని
ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జనసేన బిజెపికి మద్దతు ఇవ్వలేదని
అయినప్పటికీ జనసేన తమతోనే ఉందని బిజెపి నేతలు ప్రకటించుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపి జేఎస్పీలు కలిసి నడుస్తాయని తాము అనుకోవటం లేదనిఅన్నారు.
కేంద్రంలో బిజెపిని గద్దె దింపేందుకు 16 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటి పైకి నడిచేందుకు సిద్ధమవుతున్నారని
కర్ణాటకలో బిజెపి ఓడిపోవడం ఖాయమని అదే వ్యతిరేక పవనాలు దేశం మొత్తం విస్థాయిని అన్నారు.కేంద్రంలో బిజెపిని రాష్ట్రంలోఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసిపిని సాగనంపుతామని కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకు సిద్ధమని జనసేనతో కలిసి నడుస్తామని వైసిపిని ప్రజలు ఇంటికి సాగనంపుతారని స్పష్టం చేశారు.సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాట్లాడుతూ ప్రజా ఉద్యమానికి ఈరోజు 1200వ రోజురాష్ట్ర ప్రగతికి పునాది అమరావతి అని అమరావతి నిర్మాణం కోసం పోరాడుతున్న ఐదు కోట్ల ఆంధ్రులకు సిపిఐ జె జె లు పలుకుతుందని అన్నారు.
సియం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రజల తరుపున సిపిఐ స్వాగతిస్తుందని అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీని రాష్ట్రంలో జగన్ ని గద్ది దించడం ద్వారా ప్రత్యేక హోదా విభజన హామీలు విశాఖ ఉక్కు అమ్మకాలు ఆగి పోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అక్కనేని వనజ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్,ఇప్తా జాతీయ కార్యదర్శి గని,పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వర ప్రసాద్,సహాయ కార్యదర్శి కాసా రాంబాబు,గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి,సిహెచ్ కోటేశ్వరారావు,ఏఐటీయూసీరాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవేంద్ర నాద్,ఏఐయస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్,రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బచ్చల శివాజీ, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ మేడా హనుమంతురావు,రాష్ట్ర కౌలు రైతు సంఘం కార్యదర్శి జమలయ్య,ఏఐవై ఎఫ్ అధ్యక్షులు జంగాల చైతన్య,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు, ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ సుభాని,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, ఏ ఐ వై ఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ వలి,అమరావతి జేఏసీ కన్వీనర్ పీవీ మల్లికార్జునరావు, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతియ్య,సహాయ కార్యదర్శులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, పిల్లలమర్రి నాగేశ్వరరావు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందంబ్రమేశ్వరరావు,అన్నవరపు ప్రభాకర్,గండికోట దుర్గారావు,చిన్ని సత్య నారాయణ,తాడేపల్లి సహాయ కార్యదర్శులు తుడిమెల్లవెంకటయ్య,ముసునూర్ సుహాస్,మానికొండ మానికొండ డాంగే,మునగాల రామారావు,జవ్వాది సాంబశివరావు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img