Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత

దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత

విజయవాడ:దుర్గగుడి(Durga gudi) ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరించారు.
ఘాట్ రోడ్డులోని కొండ ప్రాంతంలో చిన్న చిన్న కొండరాళ్లు పడుతున్నాయి. మహామండపం ద్వారానే భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని దుర్గగుడి ఈవో భ్రమరాంబ(Bhramaramba) ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో(EO) మాట్లాడుతూ… గత మూడు రోజులుగా వర్షం పడుతున్న దృష్ట్యా ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తున్నామన్నారు. శాకాంబరీ ఉత్సవాల దృష్ట్యా పదుల సంఖ్యలో వచ్చే వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తామని తెలిపారు. వాతావరణం అనుకూలించాకే వాహనాలను కొండపైకి అనుమతించనున్నట్లు దుర్గగుడి ఈవో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img