https://www.fapjunk.com https://pornohit.net london escort london escorts buy instagram followers buy tiktok followers Ankara Escort Cialis Cialis 20 Mg
Sunday, February 25, 2024
Sunday, February 25, 2024

ఎక్కడి చెత్త అక్కడే…

ఎక్కడి చెత్త అక్కడే…
` మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రారంభం

విశాలాంధ్ర/విజయవాడ:మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 36వేల మంది కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో సోమవారం ఉదయం ఎక్కడి చెత్త అక్కడే ఉంది. రాష్ట్రంలో ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం, మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో విజయవాడతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో వీధులు అధ్వానంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా ఈ నెల 14వ తేదీ నుంచి మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ శాఖ పరిధిలో పని చేస్తున్న వాటర్‌ వర్క్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులను ఇవాళ(సోమవారం) సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చలు ఫలించకపోతే సమ్మెను తీవ్రతరం చేయాలని కార్మిక సంఘాల నాయకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img