Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి

అనుచరులతో కలిసి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఎంపీ

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా వచ్చారు. అయితే, అవినాష్ రెడ్డి రెడ్డిని మాత్రమే లోనికి అనుమతించిన సీబీఐ అధికారులు ఆయన అనుచరులను అనుమతించలేదు. గేటు వద్దే వారి వాహనాలను నిలిపివేశారు. వివేకా హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు.కాగా, ఈ కేసులో అవినాశ్‌ ను ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని మంగళవారం తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అవినాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఈ నె 25వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు ప్రకటించింది. సీబీఐ సమన్లు, కోర్టు ఆదేశాల మేరకు అవినాష్ సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ అధికారులు ప్రశ్నలను లిఖితపూర్వకంగా అవినాష్ కు అందజేయనున్నారు. ఆయన ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేసి, కోర్టుకు సమర్పించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img