Friday, April 26, 2024
Friday, April 26, 2024

సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిన తెలంగాణ : సీఎం కేసీఆర్‌

సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (జవీ ఖజR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115 పెరిగిందని చెప్పారు. పదేండ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచిందని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. 2014లో రాష్ట్ర జీఎస్‌డీపీ (Gూణూ) విలువ రూ.5,05,849 కోట్లు మాత్రమే ఉండగా, నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్ధికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.12,93,469 కోట్లకు పెరిగిందన్నారు. అంటే కరోనా, డీ మానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ, దశాబ్ది ముంగిట తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img