Friday, April 26, 2024
Friday, April 26, 2024

అకాల వర్షం – అపార నష్టం

రైతుకు కడగండ్లు మిగిల్చిన వడగళ్ల వానలు

. యూపీ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అధిక ప్రభావం
. 5.23లక్షల హెక్టార్లలో గోదుమ పంటకు దెబ్బ – తగ్గిన దిగుబడి

న్యూదిల్లీ/చండీగఢ్‌/భోపాల్‌/జైపూర్‌ : అకాల వర్షాలు అన్నదాతలకు అపార నష్టాన్ని కలిగించాయి. వడగళ్ల వానలు కడగండ్లు మిగిల్చాయి. పంట చేతికొచ్చే సమయంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలు కురిసి రైతన్న ఆశలను ముంచెత్తాయి. జరిగే నష్టాన్ని ఊహించి సాగుదారుడు వణికిపోతున్నాడు. సముచిత పరిహారం ఇచ్చి ఆదుకుంటారని ప్రభుత్వాలపై ఆశలు పెట్టకున్నాడు.
భారత్‌లో గోధుమలు ఎక్కువగా పండుతాయి. అధిక ద్రవ్యోల్బణం, ఆహార భద్రతా సవాళ్లు, అంతర్జాతీయంగా అస్తిరత పరిస్థితులు నెలకొన్న సమయంలో అపారమైన అకాల నష్టం తీవ్రంగా ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొత్తంగా 5.23లక్షల హెక్టార్లలో గోధమ పంటకు నష్టం వాట్లింది. పంజాబ్‌, హరియాణాలో పంట నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది 34 మిలియన్‌ హెక్టార్లలో గోధుమ సాగు చేశారు. 112.2 మిలియన్‌ టన్నుల దిగుమతిని 202223 పంట వత్సరం (జులైజూన్‌)లో ప్రభుత్వం అంచనా వేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో గోధుమ సాగుతో పాటు ఇతర రబీ పంటలకు జరిగిన నష్టంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సోమవారం సమీక్షించనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహుజా ఆదివారం పీటీఐకి తెలిపారు. రబీలో గోధుమ ఎక్కువ పండుతుంది. పంటకోత సమయంలో అకాల వర్షాలతో అపార నష్టం అంచనా ఉంది. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనీస మద్దతు ధరకు ప్రొక్యూర్‌మెంట్‌ కూడా మొదలైంది.
రెండు వారాలుగా పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు, తీవ్ర గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. దీంతో జరిగే నష్టం అంచనా రైతులను భయపెడుతోంది.
తాజా పరిస్థితుల్లో దిగుబడి తగ్గిపోతుందని పంజాబ్‌లోని మొహాలీ జిల్లా, బాదర్పూర్‌ గ్రామానికి చెందిన రైతు భూపిందర్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఎకరాకు 20 క్వింటాళ్లు రావాల్సి ఉంటే 1011 క్వింటాళ్లు వస్తాయన్నారు. 34 ఎకరాల్లో గోధమ సాగు చేయగా ఇప్పటికే తీవ్రగాలులకు కొంతమేరకు పంట నేలమట్టమైందని, సగటున 50శాతం నష్టం జరిగిందని, వాతావరణం ఇలానే ఉంటే పూర్తిగా నష్టపోతానని ఆయనన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు అజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఖజురహోలో తన రెండు ఎకరాల్లో గోధమ పంటకు తేమ ఎక్కువై పరుగు పట్టి గింజ నాణ్యత తగ్గిపోయిందని వాపోయారు. మధ్యప్రదేశ్‌లో సుమారు 95లక్షల హెక్టార్లలో గోధమ సాగు చేయగా అందులో సుమారు లక్ష హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ సీనియర్‌ అధికారి వెల్లడిరచారు. అటు రాజస్తాన్‌లోనూ 3.88 లక్షల హెక్టార్లలో గోధమ పంటకు నష్టం జరిగింది. మొత్తం 29.65లక్షల హెక్టార్లలో పంట వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోధుమతో పాటు ఆవాలు, శెనగ, బార్లీ, ఇతర కూరగాయల పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. 1.54 లక్షల హెక్టార్లలో ఆవాలు, 1.29లక్షల ఎకరాల్లో శెనగ పంటలు దెబ్బతిన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోనూ 35వేల హెక్టార్లలో గోధమ పంటకు నష్టం జరిగిందని ఆ రాష్ట్ర ఉపశమన కమిషన్‌ వెల్లడిరచింది. ఆగ్రా, బరేలీ, చందౌలీ, హమీర్‌పూర్‌, రaాన్సీ, లలిత్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, ఉన్నావో, వారణాసితో కలిపి మొత్తం తొమ్మిది జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. 1.25లక్షల గోధుమ రైతులపై అకాల వర్షం ప్రభావం కనిపించిందని, వీరిలో 43,142 మంది రైతుల నష్టసమాచారం తమ వద్ద ఉన్నదని కమిషనర్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ తెలిపారు. డేటా సేకరణ పూర్తైన తర్వాత రైతులకు పరిహారం అందుతుందన్నారు. ఇదిలా ఉంటే పంట నష్టం అంచనా వేసే ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని తమ రాష్ట్రాల సంబంధిత అధికారులకు పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలు ఆదేశాలిచ్చాయి. ఈఫసల్‌ పోర్టల్‌లో నష్టాన్ని నమోదు చేసుకుంటే, తదనుగుణంగా పరిహారాన్ని మే నెలలో ఇస్తామని రైతులకు హరియాణా సీఎం ఖట్టర్‌ సూచించారు. పంజాబ్‌ ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారాన్ని 25శాతం పెంచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img