Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

అయితే ప్రధానమంత్రి..లేదంటే ముఖ్యమంత్రి…: మాయావతి

తన మద్దతుదారులు తలుచుకుంటే తనను ప్రధానమంత్రిని చేయగలరని బీఎస్పీ చీఫ్‌ మాయావతి పేర్కొన్నారు. దళితులు, ముస్లింలు, ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారు ఏకతాటిపై నడిస్తే తాను ప్రధాని అవడం తథ్యమని అన్నారు. ఆయా వర్గాల్లో తన మద్దతుదారులు ఉన్నారని, వారికి తనను ప్రధానిని చేసే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, భారత రాష్ట్రపతి కావాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ లేదని అన్నారు. తాను రాష్ట్రపతి కావాలనుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తుందంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ విధంగా స్పందించారు. ఇలాంటి పనికిరాని మాటలను నమ్మొద్దని అన్నారు.
తన వరకు ఉత్తరప్రదేశ్‌లో గెలిచి తిరిగి అధికారంలోకి రావడం, ఆపై ప్రధాని కావడం గురించి ఆలోచిస్తానేమో కానీ, రాష్ట్రపతి కావాలని మాత్రం ఎన్నడూ కోరుకోనని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది విలాసవంతమైన జీవితం కోసం కాదని, దళిత ఐకాన్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ల ఆశయస్ఫూర్తిని కొనసాగించడం కోసమని చెప్పారు. దళితుల సాధికారతే తన లక్ష్యమని వెల్లడిరచారు. అయితే ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో అయితేనే తన లక్ష్యాన్ని సాధించగలనని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img