Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

అసోంలో వరదలు..జలదిగ్బంధంలో 243 గ్రామాలు

అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని ఆ రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ ఏజెన్సీ తాజా బులెటిన్‌లో వెల్లడిరచింది. బ్రహ్మపుత్ర నది వరదనీటితో పొంగిపొర్లడంతో 243 గ్రామాలు నీట మునిగాయి. బిస్వానాథ్‌, బోనగైగామ్‌ చిరాంగ్‌, థీమాజీ, దిబ్రూఘడ్‌, జోర్హత్‌, లఖింపూర్‌, మాజులీ, శివసాగర్‌, సోనిట్‌ పూర్‌, తిన్‌ సుకియా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరదల వల్ల 16 ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 6,217 మంది వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించారు. వరదల్లో చిక్కుకు పోయిన 162 మందిని, 40 జంతువులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ధీమాజీ, బోనగైగామ్‌, చిరాంగ్‌, టిన్‌ సుకియా జిల్లాల్లో వరదబాధితుల కోసం సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img