Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఆ చర్య..లైంగిక వేధింపే..!

బాంబే హైకోర్టు తీర్పు కొట్టేసిన సుప్రీంకోర్టు
దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. స్పర్శ అనే పదాన్ని ‘స్కిన్‌-టు-స్కిన్‌’ కాంటాక్ట్‌కి పరిమితం చేయడం సంకుచితమైన, అసంబద్ధమైన వివరణకి దారి తీస్తుందని,చట్టం యొక్క ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని కోర్టు పేర్కొంది. దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని పేర్కొంటుందంటూ అప్పట్లో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ‘స్కిన్‌-టు-స్కిన్‌’ కాంటాక్ట్‌ నిరూపితం కానందున ఈ చర్య పోక్సో చట్ట పరిధికి రాదని, నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోలేమని తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పేర్కొన్నారు. తాజాగా ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడానికి పోక్సో చట్టం ఉద్ధేశించిందని తెలిపింది. లైంగిక వేధింపుల ఉద్ధేశంతో బట్టలు తాకడం అనేది పోక్సో నిర్వచనంలోనే ఉందని పేర్కొంది. బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ జనవరి 12 నాటి తీర్పుపై అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, ఎన్‌సీడబ్ల్యు, మహారాష్ట్ర చేసిన అప్పీళ్లను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img