Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఏపీ సర్కార్‌ పిటిషన్‌ పై తెలంగాణ, కేంద్రంకు సుప్రీంకోర్టు నోటీసులు

విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు స్పందించింది. 2014లో ఏపీ విభజన సమయంలో పార్లమెంట్‌ లో ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించారు. అందులో పేర్కొన్న విధంగా షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ రెండు షడ్యూళ్లకు సంబంధించి దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం సుప్రీంకి నివేదించింది. విభజన అంశంలో తెలంగాణ నుంచి సహకారం లేదని కోర్టుకు వివరించింది. దీంతో విభజన వ్యవహారం ఆలస్యం జరుగుతోందని పేర్కొంది. ఈ సంస్థలను వెంటనే చట్టం ప్రకారం విభజన జరిగేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంను కేంద్రం కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img