Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఏమరుపాటుగా ఉండకూడదు..జాగ్రత్తలు పాటించాలి

డబ్ల్యూహెచ్‌ఓ
వ్యాక్సిన్‌ రక్షణను దాటుకొని కరోనా కొత్త వేరియంట్‌ సోకే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌పై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ కొత్త వేరియంట్‌తో పరిస్థితులు విషమిస్తాయని చెప్పలేమని, అయితే అనిశ్చితి మాత్రం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంత సంచాలకురాలు డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ అభిప్రాయపడ్డారు. ‘‘డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే, అప్పుడే నిర్ధారణకు రాలేం’ అని చెప్పారు. ‘మహమ్మారి ఇంకా వెళ్లిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉంది. మనం తప్పక జాగ్రత్తలు పాటించాలి. మనం ఏమరుపాటుగా ఉండకూడదు..అప్రమత్తంగా ఉండాలి. వైద్యానికి మౌలిక వసతులు పెంచాలి’ అన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. కాగా దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 38కి చేరింది. ఏపీ, కేరళ, చండీగఢ్‌లో తొలిసారిగా ఒక్కొక్కటి చొప్పున కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఒక్కో కేసు నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 18, రాజస్థాన్‌ 9, కర్ణాటక 3, ఢల్లీి 2, ఏపీ, కేరళ, చంఢీగఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పన నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img