Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఒమిక్రాన్‌తో ఒక్కరూ కూడా మరణించినట్లు నివేదికలు రాలేదు

డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడి
కరోనా కోరల నుంచి బయటపడి దాదాపు అన్ని దేశాల్లోనూ సాధారణ పరిస్థితులు వచ్చేశాయని ఊపిరి పీల్చుకున్నాం. నాలుగైదు నెలలుగా అంతా సద్దుమణిందనుకునే లోపే తన ఉనికిని మరోసారి చాటుకుంది. ఎప్పటిలాగే కొత్త రూపంలో మార్పు చెందుతూ, ప్రపంచాన్ని భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆయా దేశాలు క్రమంగా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. కాగా ఈ వేరియంట్‌ 38 దేశాల్లో వ్యాప్తిచెందినా, దీనివల్ల ఒక్కరూ కూడా మరణించినట్లు నివేదికలు రాలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శనివారం వెల్లడిరచింది..ఈ కొత్త వేరియెంట్‌ ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను దెబ్బతీస్తుందనే హెచ్చరికలతో దీని వ్యాప్తిని నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యశాఖ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. దక్షిణాఫ్రికా దేశంలో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య మూడు మిలియన్లు దాటింది. యునైటెడ్‌ స్టేట్స్‌, ఆస్ట్రేలియా దేశాల్లోనూ ఈ వేరియంట్‌ సంక్రమించింది.ఈ కొత్త వేరియెంట్‌పై వివరాలు మరింత తెలుసుకునేందుకు కొన్ని వారాలు పట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వేరియంట్‌ వ్యాప్తి రాబోయే కొద్ది నెలల్లో యూరప్‌లోని సగానికి పైగా కొవిడ్‌ కేసులకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేశారని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ తెలిపారు. డెల్టా లేదా బీటా కరోనా జాతులతో పోలిస్తే ఇది రీఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని సూచిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img