Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

‘ఒమిక్రాన్‌’తో మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు : బైడెన్‌

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను అడ్డుకోవడం కోసం ఆస్ట్రేలియా, జపాన్‌ సహా పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రయాణాలపై ఆంక్షలతోపాటు సరిహద్దుల్ని మూసివేస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి తీవ్రమైతే లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉన్నాయి. అయితే అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఇప్పట్లో రాదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఆందోళనకరమే అయినా. .ఇప్పుడు మరీ అంత టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదని అన్నారు. అమెరికాలో ఆ వేరియంట్‌కు చెందిన పాజిటివ్‌ కేసు ఒకటి బయటపడిరది. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ అవసరం లేదని ఆయన అన్నారు. ఒకవేళ ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకుని ఉంటే, మాస్కులు ధరిస్తే, లాక్‌డౌన్‌ అవసరం రాదని ఆయన స్పష్టం చేశారు.ఎనిమిది దక్షిణాఫ్రికా దేశాలపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు మించి లాక్‌డౌన్‌, ప్రయాణాలను నిషేధించాల్సిన అవసరం లేదని బైడెన్‌ తెలిపారు. కరోనా కొత్త వేరియంట్‌ను వ్యాప్తిని నియంత్రించడంలో యూఎస్‌ మునుపటి కన్నా మెరుగ్గా ఉందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌పై శాస్త్రీయంగా పోరాటం చేస్తామని భయాందోళనలు అక్కర్లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img