Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కరోనా విజృంభణ..19 వేలకు చేరువగా కొత్త కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. నేడు కొత్త కేసులు 19వేలకు చేరువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,25,305 మంది కరోనాతో మరణించారు.కొత్తగా 35 మంది మరణించగా, 14,650 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతానికి చేరిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని చెప్పింది. ఇప్పటివరకు 198.33 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img