Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

గిరిజనానికి తప్పని డోలీ మోత

విశాలాంధ్ర` కురుపాం/జియ్యమ్మవలస: ఎన్నాళ్లైనా…ఎన్నేళ్లైనా ఆదివాసీ ఆడబిడ్డల ప్రసవ వేదన అరణ్య రోదనగా మిగిలి పోతోంది. సాక్షాత్తు గిరిజన ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు ఉన్నప్పటికీ అడవి బిడ్డల బతుకులు మారడం లేదు. అత్యవసర సమయంలో ఆకాశంలోకి బిత్తర చూపులు చూడటం తప్ప చేయగలిగిందేమీ కనిపించడం లేదు. ఎవరో వస్తారని… ఏదో చేస్తారని వేచిచూడకుండా తమ ప్రాణాలు తామే కాపాడు కోవాల్సిందేనంటూ ఆవేదన చెందుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు..ఓ గర్భిణీని ప్రసవం కోసం డోలీలో ఆసుప్రతికి మోసుకెళ్లిన ఘటన తాజాగా విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినతోలుమండ గ్రామంలో చోటుచేసుకుంది. కొండగొర్రి కాసులమ్మ అనే గర్భిణీని డోలీతో మోసుకుంటూ రామభద్రపురం ఆసుపత్రికి తరలించారు. కొండ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిగాల్సిసిన పరిస్థితి. సకాలంలో ఆసుపత్రికి చేరటంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మార్గమధ్యంలో కాన్పు జరిగి తల్లీబిడ్డలు మృతి చెందిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img